కారు ప్రమాదం కారణంగా IPLతో సహా.. కీలక టోర్నీలన్నింటికి దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పంత్ పై తమకు ఉన్న ప్రేమను చాటుకుంది ఢిల్లీ జట్టు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రిషబ్ పంత్.. గత ఏడాది కారు ప్రమాదంలో గాయపడి పూర్తిగా బెడ్ రెస్ట్ కే పరిమితం అయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. అడుగులు వేస్తున్నాడు. ఇక ప్రమాదం కారణంగా కీలక టోర్నీలన్నింటికి దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్. వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్, ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలకు దూరం అయ్యాడు. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పంత్ పై తమకు ఉన్న ప్రేమను చాటుకుంది ఢిల్లీ జట్టు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయం పడటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరు పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక పంత్ ఈ సీజన్ ఐపీఎల్ మెుత్తానికి దూరం అయ్యాడు అన్న సంగతి తెలిసిందే. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద ఎదురుదెబ్బ. అయితే పంత్ పై తమకు ఎంత ప్రేమ ఉందో చాటి చెప్పింది ఢిల్లీ జట్టు. శనివారం జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ జట్టు లక్నో టీమ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో హృదయాలను కట్టిపడేసే ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లో రిషబ్ పంత్ జెర్సీని ప్రదర్శించారు. రిషబ్ పంత్ కు తాము అండగా ఉన్నాము అని తెలియజేసేందుకు.. ఢిల్లీ డగౌట్ లో రిషబ్ నంబర్ 17 జెర్సీని అభిమానులకు కనిపించే విధంగా ప్రదర్శించారు. ఇందుకు సంధించిన ఫోటోను ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్వీటర్ ఖాతాల్ పోస్ట్ చేసింది. ఈ పిక్ కు “ఎల్లప్పుడూ మా డగౌట్లో.. ఎప్పుడూ మా టీమ్ లోనే” అంటూ క్యాప్షన్ సైతం ఇచ్చింది. ఇక స్టేడియంలో పంత్ జెర్సీ చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనైయ్యారు. పంత్ పై ఢిల్లీకి ఉన్న ప్రేమను ఈ విధంగా చాటి చెప్పడంతో.. ప్రేక్షకులు సైతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును అభినందిస్తున్నారు.
Always in our dugout. Always in our team ❤️💙#YehHaiNayiDilli #IPL2023 #LSGvDC #RP17 pic.twitter.com/8AN6LZdh3l
— Delhi Capitals (@DelhiCapitals) April 1, 2023