దిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్. యాక్సిడెంట్ లో గాయపడిన పంత్.. గ్రౌండ్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు. కానీ అలా జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఇంతకీ ఏంటా విషయం?
ఐపీఎల్ రోజురోజుకీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచులు కాస్త మజాని అందించగా.. రాబోయేవి కూడా అంతకు మించి అనేలా ఉండబోతున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల తలో మ్యాచ్ ఆడేశాయి. ఇక మంగళవారం దిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య దిల్లీ వేదికగా మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న గుజరాత్.. ఇందులోనూ అదరగొట్టేయాలని చూస్తోంది. మరోవైపు దిల్లీ.. సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్ తో బోణీ కొట్టాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇలాంటి టైంలో దిల్లీ జట్టు అభిమానుల కోసం అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దిల్లీ క్యాపిటల్స్ సారథిగా గత సీజన్ లో రిషభ్ పంత్ ఉన్నాడు. తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. కానీ న్యూయర్ కు ముందు జరిగిన యాక్సిడెంట్ లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకోవడానికి నెలల పట్టే ఛాన్సు ఉందని డాక్టర్స్ చెప్పారు. దీంతో వార్నర్ కు కెప్టెన్సీ అప్పగించారు. ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటున్న పంత్.. రీసెంట్ గా దిల్లీ తొలి మ్యాచ్ చూస్తూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. అతడి జెర్సీని డగౌట్ లో పెట్టిన టీమ్.. కెప్టెన్ కు అద్భుతమైన గౌరవం ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పంత్ ని గ్రౌండ్ లోకి తీసుకొచ్చేందుకు దిల్లీ మేనేజ్ మెంట్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని బయటపెట్టారు కూడా.
‘ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. గాయంతో బాధపడుతున్నా పంత్.. తన దిల్లీ జట్టుని ఎంకరేజ్ చేయడానికి ఈ రోజు స్టేడియానికి వస్తున్నాడు. అతడు దిల్లీ జట్టులోని స్టార్ క్రికెటర్. పంత్ ని స్టేడియంలో చూసి, ప్రేక్షకులు ఆనందిస్తారని అనుకుంటున్నాను’ అని దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఫ్రాంచైజీ ఓనర్స్ కూర్చొనే చోట నుంచి పంత్ మ్యాచ్ చూడనున్నాడు. బీసీసీఐ అనుమతిస్తే.. కాసేపు జట్టు డగౌట్ లోనూ ఉంటాడని ఆ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మరి గాయపడి కోలుకుంటున్న పంత్.. మ్యాచ్ కు హాజరు కానుండటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#WATCH | “There’s good news for our spectators tomorrow. Despite his injury, Rishabh Pant is coming to support his team. He is a star of Delhi (Capitals). I hope spectators will give him a clap that he is coming among his cricketers despite such injury,” says Rajan Manchanda,… pic.twitter.com/hhBjnwkLsY
— ANI (@ANI) April 3, 2023