తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు ఆరుదైన గౌరవం లభించింది. అతని ఆట తీరు మెచ్చిన రిలయన్స్ యాజమాన్యం అతని ప్రతిభకు తగ్గ గుర్తింపునిచ్చింది. ఏంటా గుర్తింపు అనుకుంటున్నారా..? అయితే కింద చదివేయండి.
ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్, హైదరాబాదీ కుర్రాడైన తిలక్ వర్మ ప్రస్తుత ఐపీఎల్ 2023 సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్, సూర్య, టిమ్ డేవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు విఫలమవుతున్న చోటే.. తిలక్ పరుగుల వరద పారిస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచులో 46 బంతుల్లో 84 రన్స్ చేసిన తిలక్.. చెన్నైతో జరిగిన మ్యాచులో 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక మంగళవారం ఢిల్లీ క్యాపటల్స్ తో జరిగిన మ్యాచులో 29 బంతుల్లో 41 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ సీజన్ లో ముంబై తరఫున హయ్యస్ట్ రన్ స్కోరర్ (147) కూడా అతడే. ఈ క్రమంలో అతనికి గౌరవం లభించింది.
తెలుగు ఆటగాడు తిలక్ వర్మతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పొజిషనింగ్, ఎండార్స్‌మెంట్‌లు, ప్రదర్శనలు, సోషల్ మీడియా మానిటైజేషన్, లైసెన్సింగ్‌తో సహా అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే రిలయన్స్ యాజమాన్యంలోని స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘రైజ్’ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇకపై కొన్ని రిలయన్స్ ప్రకటనల్లో తిలక్ వర్మ మెరవనున్నాడు. కాగా, ఈ జాబితాలో తిలక్ వర్మ ఎనిమిదో ఆటగాడు కావడం గమనార్హం. అంతకుముందు రోహిత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా రిలయన్స్‌తో కలిసి పనిచేశారు. ఐపీఎల్‌లో ఇప్పటి దాకా 17 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 544 పరుగులు చేశాడు. భారత జట్టులోకి కూడా త్వరలోనే వస్తాననే ధీమాతో ఉన్నాడు.
Extremely excited and honoured to be a part of the RISE Worldwide Talent team 🤙☺️ @R1SEWorldwide https://t.co/DiIrAnR3r3
— Tilak Varma (@TilakV9) April 13, 2023