Rinku Singh, MS Dhoni: గురాజత్ మీద ఆడిన ఇన్నింగ్స్ ఏదో అలా ఫ్లోలో వచ్చిన ఇన్నింగ్స్ కాదని.. రింకూ టైమ్ తీసుకోని సైతం చివరి వరకు బ్యాటింగ్ చేయగలడని నిరూపించాడు. లక్ష్యం మరీ పెద్దది కావడంతో మ్యాచ్ ఓడిపోయారు కానీ..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భారత క్రికెట్ చరిత్రలో శిఖరాగ్రాణ నిలిచిన పేరు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, ఫినిషర్‌గా.. టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియాలో అతను లేని లోటు అలాగే ఉండిపోయింది. ధోని ఆడే సమయంలో చివర్లో ఎంత పెద్ద టార్గెట్ ఉన్నా.. ధోని ఉన్నాడులే అనే ధైర్యం క్రికెట్ అభిమానుల్లో ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? అంటే మాత్రం ఆలోచనలో పడాల్సిన పరిస్థితి.
అయితే.. ప్రస్తుతం ఓ కుర్రాడు ధోని లేని లోటును తీర్చేవాడిలా కనిపిస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ యువ క్రికెటర్ ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరూ ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిచిన నయా సంచలనం రింకూ సింగ్. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్‌కు ఆడుతున్న ఈ ఉత్తర్ ప్రదేశ్ క్రికెటర్.. కేకేఆర్ టీమ్‌లో ఫినిషర్‌గా మంచి రోల్‌ను పోషిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఐదు బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో 5 సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిపించిన రింకూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లోనూ.. 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులతో చివరి వరకు పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 229 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 205 పరుగులు చేసి.. 23 పరుగుల తేడాతో ఓటమి పాలైనా.. రింకూ చూపించిన పోరాట పటిమపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
గురాజత్ మీద ఆడిన ఇన్నింగ్స్ ఏదో అలా ఫ్లోలో వచ్చిన ఇన్నింగ్స్ కాదని.. రింకూ టైమ్ తీసుకోని సైతం చివరి వరకు బ్యాటింగ్ చేయగలడని నిరూపించాడు. లక్ష్యం మరీ పెద్దది కావడంతో మ్యాచ్ ఓడిపోయారు కానీ.. చివరి ఓవర్‌లో 20 లోపల్ రిక్వైర్డ్ స్కోర్ ఉంటే రింకూ గెలిపించే వాడని ఫ్యాన్స్ అంటున్నారు. మ్యాచ్ ఫలితం సంగతి పక్కనపెడితే.. ఒత్తిడిలో రింకూ ఆడే విధానం ఇప్పుడు హైలెట్‌గా మారింది. రింకూలోని ఈ టాలెంటే ధోనితో పోల్చేలా చేస్తోంది. మ్యాచ్ ఎంత టైట్‌గా వెళ్లి.. టన్నుల కొద్ది ఒత్తిడి ఉన్నా.. ధోని ఎలా కూల్‌గా ఉంటూ బ్యాటింగ్ చేస్తాడో, రింకూ సైతం అలాగే ఆడుతున్నాడు. దీంతో.. ఇలాంటి ప్రదర్శనను కొనసాగించి, త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. భారత జట్టులో ధోని లేని లోటును తీర్చాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rinku singh is what Dhoni wanted to be and Thela fans hype him to be. pic.twitter.com/qnpCpKFsZ3
— ANKIT (@VintageSRKian) April 14, 2023