భారత స్టార్ క్రికెటర్, కింగ్ విరాట్ కోహ్లీని ఒక్కసారి చూస్తే జన్మ ధన్యం అనుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అభిమానులు కాళ్లకు నమస్కరించడం చూసాము కానీ సహచర ప్లేయర్ కూడా ఇలా చేయడం కోహ్లీ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలియజేస్తుంది.
భారత స్టార్ క్రికెటర్, కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన ఫాలోయింగ్ తో సోషల్ మీడియాను కూడా ఒక ఊపు ఊపేస్తాడు రన్ మెషీన్. కోహ్లీ అంటే కేవలం అభిమానులకే కాదు కొంతమంది క్రికెటర్లకు కూడా ఆరాధ్యదైవం. కోహ్లీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది క్రికెట్లో రావాలని ప్రయత్నిస్తున్నారు. కోహ్లీని ఒక్కసారి చూస్తే జన్మ ధన్యం అనుకునేవారు చాలామందే ఉన్నారు. అలాంటి అవకాశమొస్తే ఎవరైనా వదులుకుంటారా ? అలాంటి అవకాశమే కేకేఆర్ ఆటగాడు రింకు సింగ్ కి వచ్చింది.
ఐపీఎల్ లో నిన్న బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో కోల్ కత్తా చేతిలో కోహ్లీ సేన 21 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించినా మిగిలిన వారు సహకరించకపోవడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. అయితే బెంగళూరు ఈ మ్యాచులో ఓడిపోయిన రింకు చేసిన పనికి కోహ్లీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ డగౌట్ కి వెళ్తుండగా రింకు సింగ్ కోహ్లీ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు. కోహ్లీ పాదాలను తాకుతూ నమస్కరించాడు. కోహ్లీ వెంటనే రింకు సింగ్ ని లేపుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బయట ఫ్యాన్స్ ఉండడం మామూలే. కానీ ఇలా గ్రౌండ్ లో సహచర ప్లేయర్లు కూడా కోహ్లీని ఆరాధించడం కోహ్లీకే సాధ్యం అనేలా ఉంది. ఒక స్టార్ ప్లేయర్లకు గ్రౌండ్ లో కూడా ఇంత క్రేజ్ ఉంటుందా అనేలా చేసాడు కింగ్ కోహ్లీ. మరి రింకు చేసిన పనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rinku singh touched Virat Kohli’s feet
God of Cricket @imVkohli 🙏 pic.twitter.com/BeivPsWtG7— 𝙎𝙋𝙄𝘿𝙀𝙔シ︎ (@Spidey_RCB) April 27, 2023