తాజాగా ఐపీఎల్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై తన విశ్వరూపం చూపించాడు రింకూ సింగ్. ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక రింకూ సింగ్ ఇన్నింగ్స్ పాకిస్థాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ తో పోలుస్తూ.. నెట్టింట ఓ ఫోటో వైరల్ గా మారింది.
క్రికెట్ చరిత్రలో అసాధ్యాలు అంటూ ఏమీ ఉండవు అని మరోసారి రుజువు అయ్యింది. అవి విజయాలు అయినా కానీ, రికార్డులు అయినా కానీ. చివరి వరకు పోరాడితేనే కదా విజయం సాధించేది. మధ్యలోనే పోరాటాన్ని వదిలేయ యోధుడి లక్షణం కాదు. ఇదే విషయాన్ని తాజాగా కళ్లకు కట్టినట్లు చూపించాడు కేకేఆర్ నయా సంచలనం రింకూ సింగ్. తాజాగా ఐపీఎల్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక రింకూ సింగ్ ఇన్నింగ్స్ పాకిస్థాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ తో పోలుస్తూ.. నెట్టింట ఓ ఫోటో వైరల్ గా మారింది.
రింకూ సింగ్.. ఐపీఎల్ నయా సంచలనం. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో నభుతో నభవిష్యతి అన్న రీతిలో ఆడి కేకేఆర్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. దాంతో అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే క్రికెట్ లో కొన్ని సంఘటనలు కాకతాళియంగానో లేక యాదృచ్చికంగానో సేమ్ టూ సేమ్ ఉంటాయి. ప్రస్తుతం రింకూ సింగ్ ఆడిన ఈ ఇన్నింగ్స్.. గతంలోనే కోహ్లీ పాక్ పై ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఇండియా తలపడుతోంది.
ఈ మ్యాచ్ లో టీమిండియా విజయ లక్ష్యం 160 పరుగులు. లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ పాక్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ వారివైపు తిప్పుకున్నారు. 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది భారత్. దాంతో టీమిండియా విజయం సాధించాలి అంటే 18 బంతుల్లో 48 పరుగులు చేయాలి. క్రీజ్ లో కింగ్ కోహ్లీ ఉండటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక వారు అనుకున్నట్లుగానే కింగ్ కోహ్లీ పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి అద్వితీయ విజయాన్ని అందించాడు. ఇక ఇప్పుడు ఇవే గణాంకాలు ఆదివారం జరిగిన గుజరాత్-కేకేఆర్ జట్ల మధ్య పునరావృతం అయ్యింది. సేమ్ టూ సేమ్ కేకేఆర్ జట్టు కూడా 18 బంతుల్లో 48 రన్స్ చేయాలి.
ఈ క్రమంలో రింకూ సింగ్ 7 బంతుల్లో 4 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. అయితే ఎవరికీ కేకేఆర్ విజయం మీద ఆశలు లేవు. ఈ సమయంలోనే సునామీ ఇన్నింగ్స్ ఆడాడు రింకూ సింగ్. చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక చివరి ఓవర్ లో కేకేఆర్ కు 29 పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ వరసగా 5 సిక్సర్లతో దుమ్మురేపాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ-రింకూ సింగ్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ రెండు మ్యాచ్ ల్లో గణాంకాలు సేమ్ టూ సేమ్ ఉండటంతో.. ఈ పిక్ వైరల్ గా మారింది. మరి కింగ్ విరాట్ లా రింకూ కూడా మ్యాచ్ ను గెలిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rinku Singh said ” Virat Kohli is my Idol and i am following his path”. pic.twitter.com/GEQT5L62ot
— Shaurya. (@Kolly_Devotee) April 9, 2023