ఐపీఎల్ లో రింకు సింగ్ తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా ఛేజింగ్ లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ సీజన్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన రింకు.. ఛేజింగ్ లో ఒక అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న లక్నో సూపర్ జయింట్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచులో లక్నో జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచులో చివరి బంతికి ఫలితం వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. 70 పరుగులకే సగం జట్టుని కోల్పోయి పీకల్లోతుకి కష్టాల్లో పడిన లక్నో జట్టుని పూరన్, బదోని భాగస్వామ్యం ఆదుకుంది. ముఖ్యంగా పూరన్ ఎదురుదాడికి దిగి బౌండర్ల వర్షం కురిపించాడు. ఇక లక్ష్య ఛేదనలో రింకు సింగ్ భయపెట్టినా.. చివరికీ లక్నోనే విజయం వరించింది. ఈ క్రమంలో రింకు సింగ్ ఛేజింగ్ లో ఒక అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
18 ఓవర్లలో కేకేఆర్ స్కోర్ 136/7. కేకేఆర్ మ్యాచ్ గెలవాలంటే మిగిలిన రెండు ఓవర్లలో 41 పరుగులు చేయాలి. ఈ దశలో కేకేఆర్ మీద ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. గ్రీజ్ లో రింకు సింగ్ ఉన్నప్పటికీ.. వికెట్లు లేకపోవడంతో కేకేఆర్ ఓటమో ఖాయమనుకున్నారంతా. అనుకున్నట్లుగానే కేకేఆర్ ఓడిపోయింది. కానీ రింకు సింగ్ మాత్రం చివరి బంతి వరకు పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఛేజింగ్ లో ఇప్పుడు ఈ యంగ్ బ్యాటర్ ఒక కొత్త రికార్డ్ సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్ల లిస్టులో రింకు సింగ్ రెండవ స్థానంలో నిలిచాడు.
2022 లో మిల్లర్ 160 యావరేజ్ ఇప్పటివరకు ఛేజింగ్ లో అత్యధికం. అయితే ఈసీజన్ లో మాత్రం రింకునే 152.5 యావరేజ్ కలిగి ఉండగా.. ఓవరాల్ గా రెండో స్థానంలో నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనిని సైతం వెనక్కి నెట్టడం విశేషం. ఈ సీజన్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన రింకు.. అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చేజిగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న రింకు ముందు ముందు ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.