ఛాన్స్ వచ్చినప్పుడు దిక్కులు చూడకూడదు. యూజ్ చేసుకుని స్టార్ అయిపోవాలి. అలా వరసగా ఐదు సిక్సులు కొట్టిన రింకూ సింగ్.. ఐపీఎల్ నయా స్టార్ అయిపోయాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అవేమి తన ఆటకు అడ్డుకాదని నిరూపించాడు.
ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమై పదిరోజులు పైనే అవుతుంది. అయినా సరే ఈసారి ఎందుకో ఇంట్రెస్ట్ రావడం లేదు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి కాస్త డల్ గానే సాగుతోంది. ముంబయి, చెన్నై, ఆర్సీబీ మ్యాచులు తప్పితే మిగతా జట్లు ఆడే మ్యాచులకు అంతంత మాత్రంగానే చూస్తున్నారు. అలాంటి ఈ టైంలో వరస విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ నే వణికించాడు. కోల్ కతా జట్టులో ఓ అనామక ప్లేయర్ గా ఉన్నవాడు కాస్త.. ఆదివారం మ్యాచ్ తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. అతడి పేరే రింకూ సింగ్. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ ప్రేక్షకులకు ఈ ఆదివారం ఫుల్ మజా ఇచ్చింది. కోల్ కతా-గుజరాత్ మ్యాచ్ అయితే మైండ్ పోయే ఎక్స్ పీరియెన్స్ అందించింది. దానికి కారణం రింకూ సింగ్. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్.. ఈ సీజన్ లో వరసగా రెండు విజయాలు నమోదు చేసి ఫుల్ జోష్ లో ఉంది. వీళ్లని అడ్డుకునే టీమ్ ఏది అని అందరూ చూస్తున్నారు. అలాంటి టైంలో అంచనాల్లేకుండా వచ్చిన కోల్ కతా.. దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసి చూపించింది. అసలు గెలిచే ఛాన్స్ లేని మ్యాచుని సొంతం చేసుకుంది. దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రింకూ సింగ్.
తాజాగా జరిగిన మ్యాచునే తీసుకుంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, 204 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కోల్ కతా బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ 83, నితీష్ రానా 45 పరుగులతో అదరగొట్టినప్పటికీ వాళ్లు ఔటైపోయిన తర్వాత బ్యాటింగ్ కష్టమైపోయింది. రసెల్, శార్దుల్ కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇలాంటి టైంలో క్రీజులో కుదురుకున్న రింకూ సింగ్.. ఫస్ట్ అంతా చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. చివరి ఓవర్ లో మాత్రం పూనకం వచ్చినట్లు శివాలెత్తాడు. ఐదు బంతుల్లో 29 రన్స్ కొట్టాల్సిన టైంలో ఏ మాత్రం కంగారు పడకుండా చాలా కూల్ గా ఐదు సిక్సులు కొట్టి మ్యాచుని గెలిపించేశాడు. దీంతో అతడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ సెర్చ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో పుట్టిన రింకూ సింగ్ ది చాలా పేద కుటుంబం. తండ్రి, అన్నలు గ్యాస్ సిలిండర్స్ ఇంటింటికీ సరఫరా చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇద్దరూ ఆటోడ్రైవర్స్ గానూ పనిచేసినవారే. 9వ క్లాస్ వరకే చదువుకున్న రింకూ.. స్వీపర్ గా కొన్నాళ్లు పనిచేశాడు. కానీ క్రికెట్ పై ఉన్న ఇష్టం అతడిని ఐపీఎల్ లోకి తీసుకొచ్చింది. 2017లో పంజాబ్ ఇతడిని రూ.10 లక్షల బేస్ ప్రైజ్ పెట్టి కొనుక్కుంది. 2018లో కోల్ కతా ఏకంగా రూ.80 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఈ జట్టులోనే కొనసాగుతున్నాడు. కొన్ని ఛాన్సులు వచ్చినా సరే సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఇప్పుడు గుజరాత్ తో మ్యాచ్ లోని చివరి ఓవర్ లో ఏకంగా ఐదు సిక్సులు కొట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గెలిపించాడు. దీంతో ఇతడి పేరు మార్మోగిపోతుంది. మరిన్ని అద్భుత ఇన్నింగ్స్ లు ఆడి టీమిండియాలోనూ చోటు దక్కించుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు. మరి రింకూ సింగ్.. సిక్సుల మోత చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కింద కామెంట్ చేయండి.
RINKU SINGH PULLS OF ONE OF THE GREATEST HEISTS IN IPL HISTORY. @rinkusingh235 – 48 (21)* vs GT, IPL 2023.pic.twitter.com/ObkVZ8SaR4
— Sexy Cricket Shots (@sexycricketshot) April 9, 2023