ఐపీఎల్ లో నయా స్టార్ వచ్చాడు. కోల్ కతాని ఒంటిచేత్తో గెలిపించిన రింకూ.. ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారడంతోపాటు సరికొత్త రికార్డులను సృష్టించాడు. ఈ విషయంలో ధోనీనే మించిపోయాడు.
ఐపీఎల్ పేరు చెప్పగానే అందరూ ధోనీ గురించి, ఫినిషర్ గా అతడు కొట్టే సిక్సులు గురించే మాట్లాడుకుంటారు. కొన్నాళ్లపాటు దాన్నే మర్చిపోయేలా చేశాడు రింకూ సింగ్ అనే యంగ్ క్రికెటర్. గుజరాత్ తో ఆదివారం జరిగిన కోల్ కతా అసాధ్యమైన రీతిలో మ్యాచ్ గెలిచింది. దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అంటే అందరూ చెప్పే పేరు రింకూ సింగ్. చివరి ఓవర్ లో చివరి ఐదు బంతుల్ని సిక్సులుగా మలచిన రింకూ.. ఐపీఎల్ నయా స్టార్ గా అవతరించాడు. ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసి పడేశాడు. దీంతో ప్రతి ఒక్కరూ అతడి గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రింకూ సింగ్ పేరు గుజరాత్ తో మ్యాచ్ కంటే ముందు కొద్ది మందికి తెలుసు. 2017లో తొలుత పంజాబ్ జట్టు ఇతడిని తీసుకుంది. ఆ తర్వాత ఏడాది కోల్ కతా ఏకంగా రూ.80 లక్షలు పెట్టి కొనుక్కుంది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే ఐదేళ్ల నుంచి జట్టులోనే కొనసాగుతున్నాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నాడు. అందుకే గుజరాత్ తో మ్యాచ్ లో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. చివరి ఐదు బంతుల్లో 29 రన్స్ కొట్టాల్సిన టైంలో చాలా కూల్ గా ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. తన నేమ్ మార్మోగిపోయేలా చేశాడు.
అయితే చివరి ఓవర్ లో ఫినిషింగ్ అంటే అందరూ ధోనీ గురించే మాట్లాడుకుంటారు. అందుకు తగ్గట్లే ఐపీఎల్ లో చివరి ఓవర్ పరుగుల ఛేదనలో 24 పరుగులతో ధోనీనే టాప్ లో ఉన్నాడు. ఆర్సీబీపై ఈ రన్స్ కొట్టాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసిన రింకూ.. 30 రన్స్ కొట్టి టాప్ లోకి వచ్చేశాడు. మరి ఇతడి రికార్డుని ఎవరైనా బ్రేక్ చేస్తారా? అది అలానే ఉంటుందా అనేది చూడాలి. ఇక గుజరాత్ తో మ్యాచులో సిక్సులతో చరిత్ర సృష్టించిన రింకూ.. ఈ సీజన్ మొత్తం ఇదే ఊపు కొనసాగిస్తే టీమిండియాలోకి వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో? సరే ఇదంతా పక్కనబెడితే ధోనీ రికార్డుని రింకూ బ్రేక్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
6 to win the match – Dhoni
6, 6 to win the match – Tewatia
6, 6, 6 , 6, 6 to win the match – ONLY RINKU SINGH!— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023