చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. గుజరాత్ ని తాజా మ్యాచ్ లో ఓడించి, ఐపీఎల్ 10వ ఫైనల్ ఆడేందుకు రెడీ అయిపోయింది. మరి ఈ సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించింది. ఏకంగా 10వ సారి ఫైనల్ లో అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్ లో తాము కింగ్స్ అని మరోసారి ప్రూవ్ చేసింది. తాజాగా క్వాలిఫయర్-1 మ్యాచ్ లో చెన్నై గెలుపు అసాధ్యమని చాలామంది అనుకున్నారు. టాస్ ఓడిపోవడం, నార్మల్ స్కోరు చేయడం, అవతలున్నది గుజరాత్ లాంటి టాప్ మోస్ట్ జట్టు కావడం.. ఇలా చాలామంది చాలా అనుకున్నారు. కానీ మ్యాచ్ లో గెలిచింది మాత్రం చెన్నై. ఇది ఎలా సాధ్యమైంది అంటే అందరూ ధోనీ.. ధోనీ అని అంటారు. కానీ అతడిని మించిన సక్సెస్ సీక్రెట్ ఆ జట్టులో దాగి ఉంది. టోర్నీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అదొక్కటే ప్రతిసారి ప్లస్ అవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 16వ సీజన్. ఇందులో చెన్నై 14 సీజన్లు ఆడింది. 12 సార్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. తాజాగా గుజరాత్ పై గెలిచి ఏకంగా 10వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆల్రెడీ నాలుగు కప్పులు గెలిచిన ధోనీసేన.. ఆల్మోస్ట్ ఐదో కప్ గెలవడానికి రెడీ అయిపోయింది. ఈ గణాంకాలు చూస్తున్న మిగతా జట్లకు మైండ్ పోతుంటుంది. ఎందుకంటే అక్కడున్నది చెన్నై సూపర్ కింగ్స్. అయితే 2008లో ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచి ధోనీనే కెప్టెన్ గా ఉన్నాడు. జట్టులో చాలా ఏళ్లపాటు బ్రావో, డుప్లెసిస్, రైనా, జడేజా లాంటి వాళ్లని దాదాపు మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఓ జట్టు సదరు ఆటగాళ్లని అన్నేళ్లపాటు నమ్మడం అంటే సాధారణ విషయం కాదు. ఓసారి ఫ్రాంచైజీ తనని నమ్మిందంటే.. సదరు ప్లేయర్ అసలు ఆట బయటకొస్తుంది. తాజాగా గుజరాత్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో చెన్నై ప్లేయర్లు అదే చేశారు. కెప్టెన్ ధోనీతోపాటు జట్టు తమపై నమ్మకాన్ని నిలబెట్టారు. ఫైనల్ కి తీసుకొచ్చారు.
చెన్నై టీమ్ లో మేజర్ ప్లస్ పాయింట్ ధోనీ. టీమిండియా కెప్టెన్ గా ఆల్రెడీ అద్భుతాలు చేసిన ఇతడు.. చెన్నై తరఫున వికెట్ల వెనక అంతకు మించి అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. జట్టులోని యంగ్, సీనియర్ క్రికెటర్ అనే తేడా లేకుండా వాళ్లు వాళ్లని నమ్మే వాతావరణం క్రియేట్ అయ్యేలా చేశాడు. అందుకే రాయుడు, రహానె, ఉతప్ప, నెహ్రా లాంటి వాళ్లని పని అయిపోయిందని అందరూ వదిలేశారు. కానీ వాళ్లే చెన్నై టీమ్ లోకి వచ్చిన తర్వాత జట్టుకి చాలా అంటే చాలా ఉపయోగపడ్డారు. స్టోరీ చదువుతున్న చెన్నై ఫ్యాన్స్ కి ఇది తెలిసే ఉంటుంది. అలానే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కామ్ అండ్ కూల్ గా ఉండటం చెన్నై టీమ్ కి కలిసొచ్చే అంశం. ధోనీ ప్రభావమో ఏమో గానీ చెన్నై జట్టులోని క్రికెటర్లు అందరూ కూడా మ్యాచ్ గెలిచినా, ఓడినా పెద్దగా బాధపడరు. ఈ అంశం కూడా చెన్నై ఇన్ని సీజన్ల నుంచి సక్సెస్ ఫుల్ ఆడటానికి కారణం అనిపిస్తోంది. ఇలా చెప్పుకుంటేపోతే ధోనీతో పాటు సీఎస్కేలో చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. మరి మేం చెప్పిన వాటిపై మీరేం అంటారు? ఒకవేళ ఏమైనా చెప్పడం మిస్ అయితే వాటిని కింద కామెంట్ చేయండి.
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!
🎥 Join the Chennai Super Kings as they celebrate a spectacular win and become the first finalists of #TATAIPL 2023 🙌#TATAIPL | #Qualifier1 | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/ZLPIY2gEEu
— IndianPremierLeague (@IPL) May 23, 2023