ఈ సీజన్ లో దాదాపు ప్రతి జట్టుపై ఆధిపత్యం చూపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ ని మాత్రం ఓడించలేకపోతోంది. ఇంతకీ కారణమేంటి? అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది?
చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ధోనీనే. అందుకు తగ్గట్లే అతడికి వీడ్కోలు ఇవ్వడానికా అన్నట్లు ఈ సీజన్ లో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ చేస్తోంది. కప్ రేసులోనూ ముందుంది. అన్ని జట్లపై ఆధిపత్యం చూపిస్తున్న సీఎస్కే.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రం దెబ్బలు తింటోంది. చెప్పాలంటే ఈ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త తలనొప్పిగా మారిపోయింది. అవును మీరు విన్నది కరెక్టే. ఈ సీజన్ లో రెండుసార్లు తలపడితే.. ఆ రెండింటిలోనూ రాజస్థాన్ గెలిచింది. కానీ చెన్నై ఆ తప్పు చేస్తుండటం పదే పదే చేస్తుండటం వల్లే ఇలా జరుగుతోంది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ లో పెద్ద చరిత్రే ఉంది. ఇప్పటివరకు నాలుగుసార్లు కప్ గెలిచిన ఈ జట్టు.. 2020 మినహా ప్రతి సీజన్ లోనూ క్వాలిఫయర్స్ కు అర్హత సాధించింది. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు చెన్నై ఎంత పక్కాగా ఆడుతోందో అనేది. ఆ జట్టు ఈ జట్టు అనే తేడా లేకుండా ప్రతిదానిపై డామినేషన్ చూపించిన చెన్నై.. ముంబయి ఇండియన్స్ పై కాస్త వెనక్కి తగ్గేది. మ్యాచులు ఓడిపోయేది కూడా. ఇప్పుడు చెన్నైకి ముంబయి కాదు రాజస్థాన్ జట్టు కొత్త తలనొప్పిగా మారింది. ఈ జట్ల మధ్య జరిగిన గత 7 మ్యాచుల్లో చెన్నై ఒక్కసారి మాత్రమే గెలిచింది. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.
రాజస్థాన్ పై చెన్నై ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటా అని చూస్తే.. స్పిన్ బౌలింగ్. అన్ని జట్లపై బాగా చెన్నై.. రాజస్థాన్ తో మ్యాచ్ అనేసరికి తెగ ఇబ్బంది పడుతోంది. అశ్విన్, చాహల్.. ధోనీసేనని తికమక పెట్టేస్తున్నారు. అసలు పరుగులే చేయకుండా కట్టడి చేస్తూ, అదే టైమ్ లో కీలకమైన వికెట్లు తీస్తున్నారు. తాజా మ్యాచ్ లోనూ సేమ్ అలానే జరిగింది. రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 202/5 భారీ స్కోరు చేసింది. ఛేదనలో చెన్నై వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. దీంతో 170/6 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 32 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ స్పిన్నర్లతో జాగ్రత్తగా ఉండాలని సీఎస్కేకి గత మ్యాచ్ లోనే అర్థమైంది. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే రిపీటైంది. దీనిబట్టి చూస్తుంటే.. చెన్నై తెలిసే తప్పు చేస్తుందా అనిపిస్తోంది. ఇలా మరోసారి జరగకూడదు అనుకుంటే చెన్నై జట్టు స్పిన్ విషయంలో చాలా అంటే చాలా ప్రాక్టీసు చేసుకోవాలి. సరే ఇదంతా పక్కనబెడితే చెన్నైకి రాజస్థాన్ జట్టు తలనొప్పిగా మారడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Back to winning ways! 💗💗💗 pic.twitter.com/T3Yp0mEXq8
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2023