భారత యువ క్రికెటర్ పృథ్వి షా కష్టాల కడలిలో చిక్కుకుపోయాడు. కష్టాలు తీర్చాలని సాయి బాబాను మొక్కుకున్నా అతని ప్రయత్నాలు ఫలించట్లేదు. వరుసగా విఫలమవుతూ సీనియర్ల చేత చీవాట్లు తింటున్నాడు. ఇప్పుడు మరోసారి అలానే ఔటై.. తిట్లు తినడానికి సిద్దమయ్యాడు. ఎందుకు..? ఏం జరిగింది? అన్నది తెలియాలంటే కింద చదివేయండి.
‘ఒకవైపు సప్నా గిల్ వివాదం.. మరోవైపు పరుగుల లేమి..’ భారత యువ క్రికెటర్ పృథ్వి షాను వెంటాడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన కష్టాలు తీర్చాలని పృథ్వి షా.. సాయి బాబాను మొక్కుకున్నా ఫలితం ఉండట్లేదు. వరుసగా విఫలమవుతూ సీనియర్ల చేత చీవాట్లు తింటున్నాడు. వస్తున్న అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నాడు. తాజాగా, ఆర్సీబీతో జరిగిన మ్యాచులో పృథ్వి షా మరోసారి తక్కువ స్కోరుకే ఔటై పెవిలియన్ చేరాడు. కాకుంటే.. ఈ ఔట్ కాస్త ప్రత్యేకతమైనదే.
ప్రస్తుతం పృథ్వి షా 23 ఏళ్లు. ఈ వయస్సులో ఎలా పరుగెత్తాలి. వాయు వేగంతో దూసుకెళ్ళాలి. కానీ పృథ్వి షా.. వయసు మళ్లిన వారిలా పరుగులు పెడుతున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచులో అలానే పరుగులు పెట్టి రనౌట్‌గా వెనుదిరిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 174 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీకి ఏమాత్రం శుభారంభం లభించలేదు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా రూపంలో వికెట్ కోల్పోయింది. అనూజ్ రావత్ వేసిన అద్భుత త్రోకి.. పృథ్వీ షా పరుగులేమి చేయకుండానే వెనుతిరిగాడు. ఇక్కడ పృథ్వీ షా చాలా స్లోగా పరుగెత్తాడనే చెప్పాలి. ఇప్పటికే ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న అతనికి ఈ పరుగు రిస్క్ అని తెలుసు. అయినప్పటికీ అలానే పరుగులు పెట్టి పెవిలియన్ చేరాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Talk about creating an 𝙄𝙈𝙋𝘼𝘾𝙏!
Anuj Rawat gets the opposition impact player Prithvi Shaw out with a terrific direct-hit 🎯#TATAIPL | #RCBvDC pic.twitter.com/Nd8pNum9mo
— IndianPremierLeague (@IPL) April 15, 2023
ఆ తర్వాత వన్ డౌన్ వచ్చిన మార్ష్(0) సైతం డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రెండు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ ల నష్టానికి 2 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ఢిల్లీ విజయం సాధించాలంటే అద్భుతమే జరగాలి. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యింది. పృథ్వి షా ఫిట్‌నెస్ పై, అతని కష్టాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Prithvi Shaw right now 😂 #IPL2023 #RCBvsDC pic.twitter.com/Dukexhvn7W
— 𝗿𝗼𝗵𝗶𝘁♧︎︎︎ (ᴄsᴋ) (@_YESIMFUNNYY) April 15, 2023
Sai Baba after watching Prithvi Shaw#IPL2023 pic.twitter.com/EOTCPNKTIl
— Abhishek Shetty (@abhishk07) April 15, 2023
Summary of Prithvi Shaw IPL2023#IPL2023 #prithvishaw pic.twitter.com/EbNfQ64Ic2
— Troll Cricket (@Trollcricket0) April 15, 2023