'క్యాచెస్ విన్ మ్యాచెస్..' ఈ విషయం క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికీ తెలుసు. మ్యాచులో విజయం సాధించాలంటే.. బ్యాటర్లు, బౌలర్లు రాణించడం ఎంత ముఖ్యమో.. ఫీల్డర్లు అదే స్థాయిలో రాణించగలగాలి. అప్పుడే విజయానికి దగ్గరవుతాం.. అలాంటి క్యాచ్ తో మెరిశాడు.. ఓ యువ క్రికెటర్.
ఐపీఎల్ అంటేనే.. ఒక పండుగ. బ్యాటర్లు ధనాధన్ బ్యాటింగ్‌కి తోడు, బౌలర్ల మ్యాజిక్ బాల్స్, ఫీల్డర్ల జిమ్నాస్టిక్ విన్యాసాలు అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటాయి. ఇలాంటివి ప్రతి మ్యాచులో చోటుచేకునేవే అయినా.. జరిగిన సందర్భం అభిమానులను కేరింతలు కొట్టిస్తూ ఉంటుంది. ఐపీఎల్‌లో భాగంగా ఆర్సీబీ- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ యువ క్రికెటర్ అమన్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఐపీఎల్‌లో భాగంగా నేడు బెంగుళూరు వేదికగా ఆర్సీబీ- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లీలు ధనాధన్ బ్యాటింగ్‌తో ఆటను ప్రారంభించారు.. అయితే ఢిల్లీ యువ క్రికెటర్ అమన్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో ఆర్సీబీ స్పీడ్‌కు అడ్డుకట్ట పడింది. డుప్లెసిస్ కొట్టిన ఓ షాట్‌ను.. షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అమన్ ఖాన్ గాల్లోకి పక్షిలా ఎగిరి ఇంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో 42 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్యాచ్ పై.. మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Is it a bird? Is it a plane? It’s A-man! 🤯#AmanHakimKhan plucks one out of thin air, to get @DelhiCapitals a big breakthrough. 💥
Tune-in to #RCBvDC at #IPLonStar, LIVE now on Star Sports Network#ShorOn #GameOn #BetterTogether pic.twitter.com/pKjgM9ecLd
— Star Sports (@StarSportsIndia) April 15, 2023