మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తన ప్రొఫెషనల్ కెరీర్ తో పాటుగా వ్యక్తిగత కెరీర్ కూడా సాఫీగా సాగుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటగాళ్లు సిరాజ్ ఇంట్లో సందడి చేస్తూ కనిపించారు.
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. రాజస్థాన్ మీద తప్పక గెలవాల్సిన మ్యాచులో భారీ విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ నెల 18 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో మరో కీలక పోరుకి సిద్ధమవుతుంది డుప్లెసిస్ సేన. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఆర్సీబీ జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మ్యాచ్ జరగడానికి ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ప్రస్తుతం బెంగళూరు ఆటగాళ్లు సిరాజ్ ఇంట్లో సందడి చేస్తూ కనిపించారు. మరి సిరాజ్ ఎక్కడ తన ఇంటిని నిర్మించుకున్నాడు? ఎవర్ని తన ఇంటికి పిలిచాడో ఇప్పుడు చూద్దాం.
మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా.. లీగ్ ఏదైనా తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. టాప్ బ్యాటర్లను సైతం తన బౌలింగ్ తో వణికిస్తున్నాడు. తన ప్రొఫెషనల్ కెరీర్ తో పాటుగా వ్యక్తిగత కెరీర్ కూడా సాఫీగా సాగుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సిరాజ్ ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. ఫిలింనగర్ కట్టిన ఈ ఇంటి గృహ ప్రవేశానికి ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ విరాట్ కోహ్లీతో పాటుగా సహచర ఆటగాళ్లను పిలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఐపీఎల్ లో ప్రస్తుతం 12 మ్యాచుల్లో 6 విజయాలను సొంతం చేసుకున్న ఆర్సీబీ టీం.. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా మిగిలిన రెండు మ్యాచులు గెలిచి తీరాల్సిందే. ఈ నేపధ్యంలో ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి. మరి సిరాజ్ కొత్త ఇంట్లో ఆర్సీబీ ఆటగాళ్లు సందడి చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
#RCB Team leaved after the New House Opening of Siraj Miya at Flim nagar , Jubilee Hills, HYD … Time : around 10:00PM #ViratKohli #MohammedSiraj #RoyalChallengersBangalore #RCBvsSRH #ViratKohli𓃵 #RohitSharma𓃵 #LSGvMI @imVkohli @faf1307 @mdsirajofficial @RCBTweets pic.twitter.com/3M2ZdD9ozc
— Tarak Anna || Anil 🖤 (@AnilTarakianNTR) May 16, 2023