RCB: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టును తొలి మ్యాచ్‌లో ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. దీంతో తొలి మ్యాచ్ గెలిచిన ఆనందం మరో మ్యాచ్ వరకు కూడా నిలువలేదు.
ఐపీఎల్ 2023ను ఘనంగా ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ ఆరంభానికి ముందే.. ఆ జట్టు స్టార్ బౌలర్ జోస్ హెజల్‌వుడ్ గాయంతో బాధపడుతుండటం ఆర్సీబీని తీవ్ర కలవర పాటుకు గురిచేసింది. కానీ, ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టుపై తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడంతో ఆర్సీబీలో హెజల్‌వుడ్ లేని లోటు అంతగా కనిపించలేదు. సిరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆ జట్టు బౌలింగ్ ఎటాక్‌ను పటిష్టం చేస్తోంది. కానీ.. ఇప్పుడు బ్యాటింగ్ విషయంలో ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది.
ఆ జట్టు యువ క్రికెటర్, గతేడాది అద్భుతంగా రాణించిన రజత్ పటీదార్ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. గాయం కారణంగా పటీదార్ ఐపీఎల్ 2023కు పూర్తిగా దూరం అవుతున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే.. పటీదార దూరం అవ్వడంతో ఆర్సీబీ మిడిల్డార్ కాస్త బలహీన పడిందనే చెప్పాలి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ మూల స్థంభాలు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగడంతో ఛేజింగ్ ఈజీ అయింది. కానీ, వాళ్లిద్దరూ ప్రతి మ్యాచ్‌లో వారిపై ఆధార పడటం సరికాదు.
పైగా ముంబై బౌలింగ్ అంత పటిష్టంగా లేదు. కానీ, రాజస్థాన్, గుజరాత్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి బలమైన బౌలింగ్ ఎటాక్ ఉన్న జట్లతో మ్యాచ్ ఆడితే అప్పుడు ఆర్సీబీ అసలు బ్యాటింగ్ బలం బయటపడుతుంది. అప్పుడు రజత్ పటీదార్ లేని లోటు స్పష్టం తెలిసే అవకాశం ఉంది. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు పటీదార్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది. తొలి విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఆర్సీబీ మంచి ప్లేయర్‌ను తీసుకుని.. విన్నింగ్ టెంపోను కొనసాగించాలని భావిస్తోంది. మరి రజత్ పటీదార్ ఐపీఎల్‌కు దూరం అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Unfortunately, Rajat Patidar has been ruled out of #IPL2023 due to an Achilles Heel injury. 💔
We wish Rajat a speedy recovery and will continue to support him during the process. 💪
The coaches and management have decided not to name a replacement player for Rajat just yet. 🗒️ pic.twitter.com/c76d2u70SY
— Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2023