RCB కప్ కొట్టాలంటే అలా చేయాలి.. లేకపోతే ఎన్నేళ్లయినా ఇంతే!

ఆర్సీబీకి మళ్లీ నిరాశే. గుజరాత్ చేతిలో ఓడి.. ప్లే ఆఫ్స్ కి చేరలేకపోయింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే టాప్-4కి కూడా వెళ్లలేకపోయింది. అసలు ఆర్సీబీ పరిస్థితి ఇలా కావడానికి కారణలేంటి? ఈ జట్టు ఎప్పుడు కప్ కొడుతుంది?

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 10:32 AM IST

ఆర్సీబీకి మళ్లీ కలిసి రాలేదు. ఒకటి, రెండు కాదు ఏకంగా 16వసారి ఐపీఎల్ కప్ కొట్టాలనే కల, కలగానే మిగిలిపోయింది. జట్టు పడిన కష్టం వేస్ట్ అయిపోయింది. ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్ మరోసారి మారిపోయింది. ‘నెక్స్ట్ సాలా కప్ నమదే’ అయిపోయింది. ఆర్సీబీ గత 16 ఏళ్లుగా ఎందుకు కప్ కొట్టాలేకపోతుంది అంటే వందమంది వంద కారణాలు చెబుతారు. కానీ కప్ ఎలా కొట్టాలనేది మాత్రం ఎవరు పెద్దగా డిస్కస్ చేయరు. ఇప్పుడు మన దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతి సీజన్ లో ఈ జట్టు చేస్తున్న తప్పుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఇక వివరాల్లోకి వెళ్తే… ఆర్సీబీ గురించి చెప్పగానే గుర్తొచ్చే సామెత ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’. ఐపీఎల్ లోనే చెన్నై, ముంబయి తర్వాత బాగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న జట్టు ఆర్సీబీ. కానీ ఏం లాభం ముంబయికి 5, చెన్నైకి 4 టైటిల్స్ ఉన్నాయి. ఆర్సీబీకి మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. డబ్బుకి, స్టార్ ప్లేయర్లకు ఏ మాత్రం కొదవలేదు. అయినాసరే ఎందుకు ఓడిపోతుంది అంటే.. కోర్ టీమ్ అనేది లేదు. అంటే చెన్నై, ముంబయి జట్లు ఓడినా గెలిచినా దాదాపు ఒకే టీమ్ తో ఆడుతుంటాయి. ఆర్సీబీలో అలా కాదు. సీజన్ కు ఓసారి జట్టు మారిపోతుంది. దీంతో ప్లేయర్ల మధ్య బాండింగ్ సరిగా సెట్ కాదు. అది మ్యాచ్ లపై ప్రభావం చూపిస్తోంది. ఈసారి కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ గండి కొట్టింది.

కోహ్లీపై అతిగా ఆధారపడటం ఆర్సీబీకి అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ లో మిగతా ఏ జట్లు తీసుకున్నాసరే ఒక్క ప్లేయర్ పై ఆధారపడవు. ఆర్సీబీలో మాత్రం అలా ఉండదు. ఈ సీజన్ నే తీసుకుంటే కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్, సిరాజ్ ని మాత్రమే ఈ జట్టు నమ్ముకుంది. అదే ప్లే ఆఫ్స్ కి చేరకుండా కొంపముంచింది. వీళ్లతోపాటు మిగతా ప్లేయర్లు కూడా ఆడితేనే కదా జట్టులో బ్యాలెన్స్ ఉండేది. అలా కాకుండా ఇద్దరు ముగ్గురిపై అతిగా ఆధారపడితే ఏ జట్టుకైనా సరే ఆర్సీబీకి పట్టిన గతే పడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఆర్సీబీకి మిడిలార్డర్, ఫినిషర్, బౌలింగ్ అనేవి చాలా పెద్ద సమస్యలు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉండనే ఉన్నాయి. ఆర్సీబీ మాత్రం దాన్ని పరిష్కరించుకోవాలని ఎప్పుడూ అనుకున్నట్లు లేదు. ఈసారి కూడా సిరాజ్ ఆ మాత్రం అయినా ఆడడు కాబట్టి సరిపోయింది. లేదంటే దిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల కంటే ముందే అస్సాం ట్రైన్ ఎక్కి ఇంటికెళ్లిపోయేది. సో అదనమాట విషయం. పైన చెప్పినట్లు.. ఓ కోర్ టీమ్ ని ఏర్పాటు చేసుకోవడం, కోహ్లీతో టీమ్ మొత్తం మంచిగా ఆడే ప్లేయర్స్ ని తీసుకోవడం, మిడిలార్డర్, బౌలింగ్ సమస్యలు లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటేనే ఆర్సీబీ కప్ కొడుతుంది. లేదంటే ఎప్పటికీ ఇలా ‘ఈ సాలా కప్ నమదే’ అనుకుంటూనే ఉంటుంది. మరి ఆర్సీబీ కప్ గెలవకపోవడానికి మేం చెప్పినవి కాకుండా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed