గిల్ బాగా బ్యాటింగ్ చేయడం వలన ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చేతిలో బలయ్యాడు. ఈ మ్యాచు ఆర్సీబీ గెలవడం ఎంత ముఖ్యమో.. గుజరాత్ విజయం సాధించడం ముంబై ఇండియన్స్ కి అంతే అవసరం.
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి వేదికగా జరిగిన ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది ఈ మ్యాచ్ గెలవడం వలన గుజరాత్ జట్టుకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా.. ఆర్సీబీ మాత్రం ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఈ నేపథ్యంలో అనుకున్నట్లుగానే ఆర్సీబీ భారీ స్కోర్ చేసినా.. పరాజయం పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం గుజరాత్ బ్యాటర్ శుభమాన్ గిల్ అని అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు బెంగళూరు ఫ్యాన్స్ గిల్ ని టార్గెట్ చేశారు.
200 పరుగుల లక్ష్యం అంటే ఏ జట్టుకైనా ఛేదించడం కాస్త సవాలుతో కూడుకున్నదే. అయితే గుజరాత్ బ్యాటర్లు మాత్రం ఆర్సీబీ విధించిన ఈ భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. గిల్ సెంచరీతో చాలా కూల్ గా క్లాస్ గా ఆడుతూ.. ఆర్సీబీ నుంచి మ్యాచ్ ని లాగేసుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పట్టు వదలని విక్రమార్కుడిలాగా చివరి వరకు గ్రీజ్ లో ఉండి.. మ్యాచ్ ని గెలిపించాడు. దీంతో ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి వెళ్ళింది. దీంతో మరో సీజన్ ఆర్సీబీకి నిరాశ తప్పలేదు.
గిల్ బాగా బ్యాటింగ్ చేయడం వలన ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చేతిలో బలయ్యాడు. ఈ మ్యాచు ఆర్సీబీ గెలవడం ఎంత ముఖ్యమో.. గుజరాత్ విజయం సాధించడం ముంబై ఇండియన్స్ కి అంతే అవసరం. ఎందుకంటే ఆర్సీబీ ఓడిపోతేనే ఈ మ్యాచులో ముంబై ప్లే ఆఫ్ కి చేరుకుంటుంది. దీంతో గిల్ సెంచరీతో ఆర్సీబీ ఓటమికి కారణమవగా.. ఇప్పుడు ఫ్యాన్స్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్ కావాలనే ముంబై ఇండియన్స్ ఓనర్ అంబానీ, సచిన్ టెండూల్కర్ తో చేతులు కలిపాడని.. అందుకే గుజరాత్ ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఇంకా రకరకాల కామెంట్స్ చేస్తూ.. గిల్ ని ఆర్సీబీ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్త్రాయల్ను కామెంట్లు రూపంలో తెలపండి.