RCB, MS Dhoni: ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ ఆర్సీబీ. ఆ జట్టు ఎంత చెత్త ప్రదర్శన చేసినా.. ఆ టీమ్‌కు భారీ మద్దతు దక్కుతుంది. అంత లాయల్ ఫ్యాన్స్ ఆర్సీబీ సొంతం. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ధోనికి సారీ చెబుతున్నారు. ఎందుకంటే.. ?
ఐపీఎల్ 2023లో ఒక్కో మ్యాచ్ ఒక్కో సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగుతోంది. ఆదివారం కేకేఆర్ కుర్రాడు రింకూ సింక్ ఐదు సిక్సుల సునామీ నుంచి ఇంకా బయటపడకముందే.. సోమవారం ఆర్సీబీ-లక్నో మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగి.. అసలైన క్రికెట్ మజాను పంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల చేసింది. తొలుత విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి కెప్టెన్ డుప్లెసిస్ సైతం మంచి సపోర్ట్ ఇచ్చాడు. దీంతో ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. పవర్ ప్లే తర్వాత రన్‌రేట్ పడిపోవడంతో వేగం పెంచే క్రమంలో కోహ్లీ అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసిన కోహ్లీ.. మరో హాఫ్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.
కోహ్లీ అవుట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ వేసిన పునాదిపై మ్యాక్సీ-డుప్లెసిస్ రెచ్చిపోయి ఆడాడు. ఫోర్లు, సిక్సుల వరద పారిస్తూ.. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్సీ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 రన్స్ చేసి.. ఇన్నింగ్స్ చివరి బాల్ మిగిలి ఉండగా అవుట్ అయ్యాడు. చివరి బాల్‌కు డీకే సింగిల్ తీసి ఇన్నింగ్స్ ముగించాడు. దీంతో.. ఆర్సీబీ 212 పరుగుల చేసి.. లక్నో ముందు 213 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను సిరాజ్ ఆరంభంలోనే చావు దెబ్బ తీశాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్‌ను డకౌట్ చేశాడు. దీంతో.. లక్నో పవర్ ప్లేలో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. వన్ డౌన్లో వచ్చిన దీపక్ హుడా సైతం 9 పరుగులకే అవుట్ అవ్వడంతో ఇక ఈ మ్యాచ్‌లో లక్నో గెలవడం కష్టమే అని అంతా భావించారు. కానీ.. స్టోయినీస్, నికోలస పూరన్ విధ్వంసంతో లక్నో భారీ లక్ష్యాన్ని ఛేదించింది. స్టోయినీస్ 30 బంతుల్లో 65, పూరన్ 24 బంతుల్లో 62 పరుగులు చేసి.. ఆర్సీబీ ఓటమిని శాసించారు.
అయితే.. స్టోయినీస్, పూరన్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్లింది. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో పూరన్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి బాల్‌కు సింగిల్ అవసరమైన దశలో హర్షల్‌పటేల్ వేసిన బాల్‌ను ఆవేశ్ ఖాన్ మిస్ చేశాడు. అయినా కూడా బైస్ కోసం పరుగులు తీశాడు. బాల్‌ను అందుకుని వెంటనే త్రో విసరడంలో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ విఫలం అయ్యాడు. లేదంటే మ్యాచ్ కచ్చితంగా సూపర్ ఓవర్‌కు వెళ్లేది. ఈ ఓటమితో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. డీకే కాస్త అలర్ట్‌గా ఉంటే.. బాగుండేదని, ఓటమికి అతనే కారణమంటూ మండిపడుతున్నారు. ఈ సమయంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తలచుకుని సారీ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనికి ఎవరూ సాటి రాలేరని.. ధోని అంటే ధోని ఒక్కడే అని.. అనవసరంగా గతంలో డీకేను ధోనితో పోల్చి తప్పుచేశామంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I’m sorry dhoni i compared u with a player like dinesh karthik 💔 pic.twitter.com/S5vXXFa5QE
— M. (@IconicKohIi) April 10, 2023
Dinesh Karthik you are not Ms Dhoni bruh !🤣
Vintage Haarcb is back 🔥#RCBvsLSG #RCBvLSG pic.twitter.com/oZcpE9It8q
— ᴍʀ.ᴠɪʟʟᴀ..!🖤 (@TuJoMilaa) April 10, 2023
Nothing against Dinesh Karthik but not everyone can hold the nerves like Mahendra Singh Dhoni #RCBvLSG pic.twitter.com/hplSOiTCpW
— ROMEO👑 (@iromeostark) April 10, 2023