ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా ఆర్సీబీని ఇష్టపడే, మద్దతు తెలిపే అభిమానులకు కొదవే లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు భారత్‌లో ఉన్న క్రేజ్ గురించి వేరేగా చెప్పాలా? క్రికెట్‌ను ఒక మతంగా చూసే మన దేశంలో.. వేసవిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఐపీఎల్‌కు అందరూ ఫ్యాన్సే. స్టార్ క్రికెటర్లు పొట్టి ఫార్మాట్లో ధనాధన్ ఆటతో దుమ్మురేపుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవంటే చెప్పండి. అందునా.. సిటీల పేరుతో ఫ్రాంచైలు ఉండటంతో వాటికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఐపీఎల్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఆర్సీబీ అన్నా, ఆ జట్టుకు మొదట్నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ అన్నా బెంగళూరు ఫ్యాన్స్‌లో ఎంతో ఇష్టం, అభిమానం కనిపిస్తుంది.
‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ ఆర్సీబీ అభిమానులు ప్రతి ఏడాది చెబుతూ వస్తున్నా ఐపీఎల్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మారింది. ఈ ఏడాదైనా కప్ కొడుతుందేమో అనుకుంటే.. అది నెరవేరడం కష్టంగానే కనిపిస్తోంది. పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తోంది ఆర్సీబీ. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచి.. మరో నాలుగింట్లో ఓడింది. దీంతో తర్వాతి మ్యాచుల్లో గెలుపోటముల మీదే ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్ గెలవాల్సిందేనని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీబీ కప్ గెలవకపోతే తాను స్కూలుకు వెళ్లనంటూ ఒక చిన్నారి మంకుపట్టు పట్టింది. ఈ మేరకు ఆర్సీబీ మ్యాచ్ జరుగుతున్న మైదానంలో ఒక ప్లకార్డ్ పట్టుకుని ప్రతిజ్ఞ చేసింది. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారి కోసమైనా బెంగళూరు టైటిల్ గెలవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
RCB fans pic.twitter.com/594s2CyCmh
— Dr Gill (@ikpsgill1) April 27, 2023