ఆర్సీబీ వరస స్ట్రోక్స్ తగులుతూనే ఉన్నాయి. ఓవైపు మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉంటే.. ఇప్పుడు జట్టులోని మరో స్టార్ ప్లేయర్ గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయం ప్రస్తుతం అందరినీ కలవరపెడుతోంది.
పాపం ఆర్సీబీ! ఆ పగవాడికి కూడా ఇన్ని కష్టాలు రావేమో బహుశా! ఎందుకంటే ఐపీఎల్ అనగానే చాలామంది గుర్తొచ్చే టాప్-3 ఫ్రాంచైజీల్లో బెంగళూరు జట్టు కచ్చితంగా ఉంటుంది. కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత ఈ జట్టు క్రేజ్ వరల్డ్ వైడ్ అయిపోయింది. డివిలియర్స్, గేల్ లాంటి బ్యాటర్లు ఉన్న టైంలో జట్టు బలంగా ఉండేది. అయినా సరే అప్పట్లో కప్ కొట్టలేకపోయింది. సీజన్ మారినా, కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నా సరే ఆ నిరీక్షణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పోనీలే ఈ సీజన్ లో అయినా సరే కప్ కొట్టే భాగ్యం దక్కుతుందనుకుంటే.. ఈసారీ కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే జట్టులోని స్టార్ ప్లేయర్స్ ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు గాయాలపాలవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ బలంగానే కనిపించింది. కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ తోపాటు యంగ్ ప్లేయర్స్, స్టార్ బౌలర్స్ చాలామంది ఉండటంతో కప్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మ్యాచులు మొదలయ్యేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. స్టార్టింగ్ మ్యాచులకు హసరంగ, హేజిల్ వుడ్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వీళ్లిద్దరూ కూడా మరో మూడు నాలుగు రోజుల్లో జట్టుతో కలవనున్నారని తెలుస్తోంది. సరే వీళ్లు వస్తున్నారా కదా ఆనందించేలోపు వరసపెట్టి షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు పూర్తిగా సీజన్ కు దూరం కాగా, ఇప్పుడు ఆ లిస్టులో మరో స్టార్ బౌలర్ చేరాడు.
ఆర్సీబీలో విల్ జాక్స్, రజత్ పాటిదార్.. ఈ సీజన్ మొదలవడానికి ముందే గాయపడ్డారు. కొన్ని మ్యాచుల తర్వాత అయినా సరే వీళ్లు రావొచ్చేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండా పూర్తిగా సీజన్ కు దూరమయ్యారని తేలింది. ముంబయితో తొలి మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ ఆపేందుకు బౌలర్ టోప్లీ ప్రయత్నించాడు. అప్పుడు భుజం కాస్త డిస్ లొకేట్ అయిందని అన్నారు. ఇప్పుడు ఏకంగా ఇతడు సీజన్ మొత్తానికే దూరమైనట్లు అధికారికంగా ప్రకటించారు. అసలే ఆర్సీబీ బౌలింగ్ వీక్. ఇప్పుడు ఉన్న స్టార్ బౌలర్ కూడా గాయంతో మొత్తం సీజన్ కే దూరం కావడం దెబ్బ మీద దెబ్బ పడినట్లే అనిపిస్తుంది. ఈ గాయాల పరంపర ఇక్కడితే ఆగితే ఓకే. లేదంటే మాత్రం బెంగళూరు జట్టు ఈ సీజన్ లోనూ కష్టాలు తప్పవు! మరి ఆర్సీబీలో వరస గాయాలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Reece Topley ruled out of IPL 2023.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023