ఆర్సీబీ అద్భుత విజయం. ముంబయి జట్టుపై అదిరిపోయే గెలుపు. కోహ్లీ సూపర్ బ్యాటింగ్. ఇవన్నీ కాదు ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మరొకటి ఉంది. ఇంతకీ అదేంటో తెలుసా?
బెంగళూరు-ముంబయి జట్ల మ్యాచ్. ఆదివారం సాయంత్రం కావడంతో కోట్లాదిమంది అభిమానులు టీవీల ముందే కూర్చున్నాడు. వాళ్ల కోసమా అన్నట్లు ఈ మ్యాచ్ ఫుల్ మజాని ఇచ్చింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చూసి తక్కువ స్కోరుకే ఆలౌటైపోయింది అనుకున్నారు. కానీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ధనాధన్ ఆటకు బాగానే స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు దాన్ని చాలా సింపుల్ గా పూర్తి చేసింది. కోహ్లీ వండర్ ఫుల్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ఆర్సీబీ సొంతమైంది. అయితే ఇక్కడ కోహ్లీతో పాటు ముంబయి ఓడిపోవడానికి మరో కారణం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఆర్సీబీ ఆర్సీబీ అని రీసౌండ్ వినపడింది. ఈసారి ఐపీఎల్ లో భాగంగా ముంబయి-బెంగళూరు జట్లు తొలిసారి తలపడ్డాయి. అందుకు తగ్గట్లే మజా కూడా సూపర్ గా వచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయికి ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. టాపార్డర్ బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోయారు. అలాంటి టైంలో క్రీజులోకి వచ్చిన తెలుగోడు తిలక్ వర్మ.. 46 బంతుల్లో 84 పరుగులు చేసి, టోటల్ స్కోరు 171 కావడంలో కీలకపాత్ర పోషించాడు. 15 ఓవర్లపాటు బాగానే కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు.. చివరి 5 ఓవర్లు మాత్రం చేతులెత్తేశారు. దీంతో ముంబయి ఈ స్కోరు చేయగలిగింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు డుప్లెసిస్ (73), కోహ్లీ (82 నాటౌట్) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. దీంతో తొలి వికెట్ 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దినేష్ కార్తిక్ 0, మ్యాక్స్ వెల్ 12 సహకారంతో చివరివరకు క్రీజులో ఉన్న కోహ్లీ మ్యాచ్ ని గెలిపించాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. 2013 నుంచి తొలి మ్యాచ్ లో ఓడిపోతూ వస్తున్న ముంబయి.. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించినట్లు కనిపిస్తుంది. కోహ్లీ బ్యాటింగ్ తోపాటు ముంబయి ఓటమికి ఇది కూడా ఓ రీజన్ అనిపిస్తుంది. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Not the start we wanted! 😔
We’ll be back stronger 👊#OneFamily #RCBvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL pic.twitter.com/W81jynqxG0
— Mumbai Indians (@mipaltan) April 2, 2023