ఏప్రిల్ 23 అనేది మనకు జస్ట్ ఓ తేదీ. కానీ ఆర్సీబీకి అలా కాదు. ఈ డేట్ లో అయితే హిట్ లేదంటే ఫట్ మనే రికార్డులు నెలకొల్పింది. దీంతో ఈ తేదీ అంటేనే ఆ జట్టు ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు!
ఆర్సీబీ పేరు చెప్పగానే ఆల్మోస్ట్ ఎవరికైనా రెండే గుర్తొస్తాయి. ఒకటి కోహ్లీ.. మరొకటి ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి కోహ్లీ.. ఈ జట్టులోనే కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్ లోనూ ధనాధన్ ఆటతో ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. దీంతో ఇప్పటివరకు గెలవని కప్.. ఈసారి కొడతారేమోనని ఫ్యాన్స్ ఆశగా, ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు. సరిగా ఇలాంటి టైంలో ఓ డేట్ ఆర్సీబీని తెగ భయపెడుతోంది. ఎందుకంటే ఆ తేదీకి ఆర్సీబీతో ఉన్న చరిత్ర అలాంటిది. ఇంతకీ ఏంటి విషయం?
అసలు విషయానికొస్తే.. అప్పట్లో ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్ టీమ్ అనేది చాలామందికి తెలుసు. ఎందుకంటే లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టు ఇదే. 2013లో పుణె సూపర్ జెయింట్స్ పై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 263 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యచ్ లో గేల్ సునామీ బ్యాటింగ్ ఆడాడు. 175 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. 2016లోనూ గుజరాత్ లయన్స్ జట్టుపై 248 పరుగులు చేసిన ఇదే ఆర్సీబీ.. టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. కానీ ఇదంతా కాయిన్ కి ఓ సైడ్ మాత్రమే. ఎందుకంటే ఈ రెండు సందర్భాల్లోనూ అంటే అప్పట్లో ఆర్సీబీ టీమ్ చాలా బలంగా ఉండేది. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
2017లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. తొలుత కేకేఆర్ బ్యాటింగ్ చేసి 131 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ 49 రన్స్ కే ఆలౌటైపోయింది. కోహ్లీ డకౌట్ కాగా.. గేల్, డివిలియర్స్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గత సీజన్ లోనూ సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ 68 పరుగులకే ఆలౌటైంది. ట్విస్ట్ ఏంటంటే.. ఇక్కడ కూడా కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇప్పటివరకు చెప్పిన నాలుగు మ్యాచులు ఏప్రిల్ 23న అంటే ఈరోజే జరిగాయి.
సరిగ్గా గమనిస్తే.. ఈ తేదీల్లో ఆర్సీబీ అప్పట్లో హిట్ కొట్టి సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ఆ తర్వాత రెండు సందర్భాల్లోనూ ఫట్ మని బుడగలా పేలిపోయింది. భారీ స్కోరులు చేసిన టైమ్ లో అంటే ఆర్సీబీ ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏప్రిల్ 23న మంచి, చెత్త రికార్డులు నమోదు చేసిన ఆర్సీబీ.. ఈసారి ఇదే తేదీన అంటే ఈరోజు రాజస్థాన్ తో మ్యాచ్ కు రెడీ అయిపోయింది. అలానే గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ జెర్సీతో ఇప్పటివరకు 11 మ్యాచులాడితే మూడింట్లో గెలిచి 6 మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అలా ఈ రెండు అంశాలు ఫ్యాన్స్ ని తెగ కంగారు పెడుతున్నాయి. మరి ఆర్సీబీ-ఏప్రిల్ 23 తేదీతో లింక్ పై మేం చేసిన అనాలిసిస్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
On the same day, RCB made two records most likely to remain unbroken.#RCB #IPL pic.twitter.com/4kS0Hqe5op
— CricTracker (@Cricketracker) April 23, 2023