ధోనీ ఫ్యాన్స్ కి జడేజా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. గుజరాత్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
రవీంద్ర జడేజా.. అందరూ ముద్దుగా జడ్డూ అని పిలుస్తారు. టీమిండియాకు దొరికిన అద్భుతమైన ఆల్ రౌండర్స్ లో ఇతడు ఒకడు. పదకొండేళ్లుగా ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్నాడు. సీఎస్కే టీమ్ విజయానికి కారణమైన వాళ్ల లిస్ట్ బయటకు తీస్తే.. ధోనీ, రైనా తర్వాత జడేజా పేరు గ్యారంటీగా ఉంటుంది. అలాంటి జడేజాపై ఈసారి సొంత జట్టు ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా ధోనీ అభిమానుల నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అయినాసరే మ్యాచులు ఆడుతున్నాడు. ఫెర్ఫార్మెన్స్ తో శెభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా క్వాలిఫయర్-1లోనూ గుజరాత్ పై చెన్నై గెలవడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఇతడు ఇప్పుడు ధోనీ ఫ్యాన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని అంటున్నారు. దీంతో అతడి బ్యాటింగ్ ఈ సీజన్ లోనే చూసేయాలని చాలామంది అనుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నై మ్యాచులు ఆడుతుంటే.. ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా స్టేడియాలన్నీ సీఎస్కే అభిమానులతో కళకళలాడిపోయాయి. అదే టైంలో ధోనీ బ్యాటింగ్ చూసేందుకు వచ్చిన అభిమానులు.. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లోనూ జడేజా త్వరగా ఔట్ అయిపోవాలని, ధోనీ క్రీజులోకి రావాలని గోలగోల చేశారు. దీంతో జడేజా బాగా నలిగిపోతున్నాడు. రీసెంట్ గా ఓ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ కు కారణమైంది. ఇప్పుడు పరోక్షంగా తనని ఇబ్బంది పెడుతున్న ధోనీ ఫ్యాన్స్ కి కౌంటర్ ఇచ్చాడు.
గుజరాత్ తో క్వాలిఫయర్ మ్యాచ్ లో 22 పరుగులు చేసిన జడేజా.. మిల్లర్, శనక లాంటి ప్లేయర్ల వికెట్ల సరైన టైంలో తీశాడు. ఈ ఆల్ రౌండర్ ప్రదర్శన.. చెన్నై విజయానికి బాగా ప్లస్ అయింది. దీంతో ‘మోస్ట్ వాల్యూబుల్ అసెట్ ఆఫ్ ది మ్యాచ్’గా జడేజా నిలిచాడు. ఈ ఫొటోని ట్వీట్ చేస్తూ.. ‘అప్ స్టాక్స్ గుర్తించింది కానీ.. కొందరు ఫ్యాన్స్ కి మాత్రం’ అని జడేజా క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుత పరిస్థితులు చూసిన ఎవరికైనా సరే అది ధోనీ ఫ్యాన్స్ కోసం పెట్టిన ట్వీట్ అని ఈజీగా అర్థమైపోతుంది. సో అదనమాట విషయం. డైరెక్ట్ గా చెప్పకపోయినా సరే జడేజా ధోనీ అభిమానులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ ట్వీట్ పై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Upstox knows but..some fans don’t 🤣🤣 pic.twitter.com/6vKVBri8IH
— Ravindrasinh jadeja (@imjadeja) May 23, 2023