ఐపీఎల్ లో ధోని, జడేజా మధ్య ఉండే అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో చెన్నై జట్టుకి ఆడుతూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సీజన్ లో ధోని మీద విపరీతమైన అభిమానం చూపించడం వలన జడేజాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలో జడేజా వేరే ఫ్రాంచైజీ వైపు మొగ్గు చూపిస్తున్నాడని తెలుస్తుంది.
ఏదైనా ఒక ఫార్మాట్ లో బాగా రాణిస్తే ఆ ప్లేయర్ మీద ప్రశంసలు కురిపించడం కామన్. అదే ఒక ప్లేయర్ మూడు ఫార్మాట్ లలో రాణిస్తే అతన్ని ఆకాశానికెత్తేస్తారు. కానీ రవీంద్ర జడేజా మాత్రం వీటన్నిటికీ మించి మూడు ఫార్మాట్ లలో బౌలింగ్ లో, బ్యాటింగ్ లో అదరగొట్టేస్తున్నాడు. దీనికి తోడు ఐపీఎల్ ల్లో కూడా అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్న ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టేస్తున్నాడు. తన మీద పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పూర్తి న్యాయం చేస్తున్నాడు. అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు జడేజాకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉండడం ఇష్టం లేదనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టులోకి రాబోతున్నాడని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
ఐపీఎల్ లో ధోని, జడేజా మధ్య ఉండే బంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో చెన్నై జట్టుకి ఆడుతూ ఎన్నో విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ మ్యాచులు ఆడేటప్పుడు కూడా వీరి సాన్నిహిత్యం అలాగే కొనసాగింది. రైనా తర్వాత ధోనికి బాగా దగ్గరైన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జడేజా మాత్రమే. పలు ఇంటర్వూలో కూడా ఒకరి మీద మరొకరు ప్రశంసలు కురిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా సఖ్యత లేదని తెలుస్తుంది. ఈ సీజన్ లో అల్ రౌండ్ షో తో అదరగొడుతున్న జడేజా.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు కూడా అందుకున్నాడు. ఇక నిన్న జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో కూడా గుజరాత్ మీద నిన్న కీలకమైన పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా సంపాదించాడు.
ఫార్మాట్ ఏదైనా జడేజా జట్టులో ఉంటే.. కెప్టెన్ తో పాటు టీంకి కూడా దైర్యంగా ఉంటుంది. ఇలాంటి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ ఉన్న జట్టు సమతూకంతో కనబడుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక విషయంలో జడేజా సంతృప్తిగా లేదని తెలుస్తుంది. దానికి కారణం ధోని అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీజన్ లో ధోనికి విపరీతమైన అభిమానం చూపించడం వలన జడేజాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదని సమాచారం. ఇటీవలే ఢిల్లీతో జరిగిన మ్యాచులో జడేజా ధారాళంగా పరుగులిచ్చిన నేపథ్యంలో ధోని జడేజా మీద ఆగ్రహం చూపించినట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి కారణాలు వేరేలా ఉన్నాయని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జడేజా చాలా సందర్భాల్లో తాను బ్యాటింగ్ కి వచ్చినప్పుడు అభిమానులు ఔటవ్వలని కోరుకుంటున్నారని విచారం వ్యక్తం చేసాడు.
Definitely 👍 pic.twitter.com/JXZNrMjVvC
— Ravindrasinh jadeja (@imjadeja) May 21, 2023
దీనికి తోడు జడేజా ట్వీట్ చేస్తూ .. “కర్మ మన దగ్గరకు తిరిగి వస్తుంది. అది రావడం కాస్త లేట్ అవుతుందేమో గాని తప్పకుండా వస్తుంది”. అని క్యాప్షన్ పెడుతూ థమ్స్ అప్ సింబల్ గుర్తు పెట్టాడు. జడ్డు ఈ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే తన భార్య రిబావ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. నీ దారిలో నువ్వు వేళ్ళు అంటూ చేతులు జోడించిన ఐకాన్ తో కామెంట్ పెట్టింది. రివాబా పెట్టిన ఈ పోస్ట్ వీరి మధ్య విబేధాలు ఉన్నాయి అనేదానికి మరింత ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో జడేజా వేరే ఫ్రాంచైజీ ఆడాలని ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది.
ఒకవేళ జడేజా వేరే ఫ్రాంఛైజీకి ఆడాలనుకుంటే మాత్రం సన్ రైజర్స్ ఈ ఆల్ రౌండర్ ని తీసుకోవడానికి రెడీ గా ఉంటుంది. సన్ రైజర్స్ జట్టులో మంచి స్వదేశీ ప్లేయర్ తో పాటు, కెప్టెన్ కూడా లేదు. ఈ కారణంగానే ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఒకవేళ జడేజా గనుక సన్ రైజర్స్ టీంలోకి వస్తే అతనికి కెప్టెన్ పదవి అప్పజెప్పడంతో పాటు.. జడేజా ఆశించిన విధంగా భారీ ఫాలోయింగ్ రావడం ఖాయం. ఇప్పటికే డేవిడ్ భాయ్ అంటూ వార్నర్ ని , కేన్ మామ అంటూ విలియంసన్ ని మన వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటారు. వీరు విదేశీయులైనా విపరీతమైన అభిమానం చూపించారు. ఒకవేళ జడేజా చెన్నైని వదులుకుంటే మాత్రం సన్ రైజర్స్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రూక్ లాంటి ప్లేయర్ ని వచ్చే ఏడాది యాక్షన్ లోకి వదిలేసి అంతే మొత్తానికి అతని ప్లేస్ లో జడేజాని తెచ్చుకుంటే సన్ రైజర్స్ కి తిరుగుండదు. మరి జడేజా చెన్నై జట్టుని వీడతాడా ?లేకపోతే మనసు మార్చుకొని ఆ జట్టులోని కొనసాగుతాడా చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.