Ravichandran Ashwin: అవార్డు అందుకున్న తర్వాత అశ్విన్ మాట్లాడుతూ అంపైర్లపై విమర్శలు చేశాడు. డ్యూ ఉందని అంపైర్లు బంతిని మార్చడాన్ని తప్పుబట్టాడు. ఇలా బంతిని మార్చడం తాను ఎప్పుడూ చూడలేదని అశ్విన్ పేర్కొన్నాడు. దీంతో.. అశ్విన్‌కు ఫైన్ వేశారు.
టీమిండియా స్టార్ స్పిన్నర్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా అశ్విన్ నోరు పారేసుకున్నట్లు నిర్ధారించి.. అతనికి భారీ జరిమానా విధించారు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత అశ్విన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్.. అశ్విన్‌కు జరిమానా విధించారు. చెన్నైతో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ అవార్డు అందుకున్న తర్వాత అశ్విన్ మాట్లాడుతూ అంపైర్లపై విమర్శలు చేశాడు. డ్యూ ఉందని అంపైర్లు బంతిని మార్చడాన్ని తప్పుబట్టాడు. ఇలా బంతిని మార్చడం తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. అంపైర్లు బాల్‌ను మార్చడం చూసి షాక్ అయ్యానని అన్నాడు. తమను అడగకుండానే అంపైర్లు బంతిని మార్చడం ఏంటో తనకు అర్థం కాలేదన్నాడు. ఈ విషయంపై అంపైర్‌ను అడగ్గా.. అలా చేసే అధికారం తమకు ఉందని చెప్పారని తెలిపాడు. ఇది తమకు అనుకూలమైన నిర్ణయమే అయినా.. ఇలా చేయడం తనకు నచ్చలేదన్నాడు బహిరంగంగా విమర్శించాడు.
అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అతని మ్యాచ్ ఫీజులో మ్యాచ్ రిఫరీ 25 శాతం కోత విధించారు. అశ్విన్ వ్యాఖ్యలు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 2.7 ప్రకారం లెవెల్ 1 తప్పిదంగా పరిగణించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ రూల్ ప్రకారం మ్యాచ్ అధికారులను, అంపైర్లను, నిబంధనలపై ఎవరూ కూడా విమర్శలు చేయవద్దు. ఇదే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌కు సైతం రూ.12 లక్షల జరిమానా విధించారు. మరి అశ్విన్ వ్యాఖ్యలు, అతనిపై చర్యలు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravichandran Ashwin has been fined 25% of his match fee for breaching the IPL Code of Conduct.
— Johns. (@CricCrazyJohns) April 13, 2023