Ravichandran Ashwin: తండ్రికి కూతర్లంటే ఎంత ప్రేమ ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాగే కూతుర్లకు కూడా నాన్నంటే పిచ్చి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని అశ్విన్ చిన్నారి కూతురు కూడా నిరూపిస్తోంది..
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కూతుర్ని ఏడిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న అశ్విన్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. రాజస్థాన్ టీమ్ సైతం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ రాజస్థాన్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూస్తూ.. అశ్విన్ కూతురు బోరున ఏడ్చింది. తొలుత చప్పట్లు కొడుతూ.. ఉత్సాహంగా కనిపించిన చిన్నారి.. కొన్ని నిమిషాల్లోనే ఏడుపు అందుకుంది.
అందుకు కారణం అశ్వినే. గుజరాత్‌పై కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్.. ఎందుర్కొన్న తొలి రెండు బంతుల్లోనే ఫోర్, సిక్స్‌తో 10 పరుగులు బాదేశాడు. దీంతో తండ్రి బ్యాటింగ్ చూసిన కూతురు సంతోషంతో చప్పట్లు, కేరింతలతో హోరెత్తించింది. కానీ, మరుసటి బంతికే షమీ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుటైన మరుక్షణమే.. ఏడుపు అందుకుంది. తండ్రి అవుట్ అవ్వడం భరించలేకపోయిన చిన్నారి.. ఒకటే ఏడుపు. తల్లి ఎంత సముదాయించినా వినలేదు.
ప్రస్తుతం అశ్విన్ కూతురు ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అశ్విన్ అంటే తన కూతురికి ఎంత ప్రేమో కదా అంటూ నెటిజన్లు మురిసిపోతున్నారు. అందుకే తండ్రులకు కొడుకలకంటే కూతుర్లపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 4 ఓవర్లలో 37 పరుగుల ఇచ్చి వికెట్ పడగొట్టకపోయినా.. బ్యాటింగ్‌లో కీలక టైమ్‌లో 10 పరుగులు చేసి.. రాజస్థాన్ విజయానికి ఎంతో దోహదం చేశాడు. మరి అశ్విన్ కూతురి ఏడుపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.