దిల్లీపై గుజరాత్ గెలిచేసింది. ఈ సీజన్ లో రెండో విక్టరీ నమోదు చేసింది. కానీ ఇదే మ్యాచులో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు గ్రౌండ్ లో ఒకరినొకరు బలంగా గుద్దుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. తాజా సీజన్ లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో దిల్లీపై ఘన విజయం సాధించింది. ఓ మాదిరి స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా తడబడింది. ఓ దశలో చాలా తక్కువ రన్స్ కే ఆలౌటైపోతుందనుకున్నారు. కానీ చివర్లో దిగిన అక్షర్ పటేల్ ధనాధన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. దిల్లీ స్కోరు 162 చేయడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ప్రత్యర్థి గుజరాత్ జట్టుకు అది సరిపోలేదు. దీంతో మెల్లగా ఆడుతూ పాడుతూ గెలిచేసింది. అయితే ఈ మ్యాచులో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ మ్యాచుల్లో ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉంటారు. అయినా సరే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా గుజరాత్-దిల్లీ మ్యాచులోనూ సేమ్ అలాంటిదే జరిగింది. ఈ సంఘటన క్యాపిటల్స్ జట్టు 15వ ఓవర్ లో చోటు చేసుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తుండగా.. సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓ బంతి లెగ్ స్క్వేర్ లో కొట్టి అటువైపే చూస్తు రన్ కోసం ప్రయత్నించాడు. బౌలర్ సర్ఫరాజ్ కూడా బంతినే చూస్తూ ఉండిపోయాడు. అలా బ్యాటర్, బౌలర్ ఎవరు ఎక్కడున్నారనేది గమనించలేదు.
అలా ఎక్కడున్నాం అనేది గమనించకపోవడం వల్ల రషీద్ ఖాన్-సర్ఫరాజ్ ఖాన్ ఒకరినొకరు ఢీ కొట్టారు.ఇద్దరు కింద పడిపోయారు. అయితే ఈ క్రమంలోనే ఇద్దరికీ పెద్దగా దెబ్బలు ఏం తగల్లేదని తెలుస్తోంది. రషీద్.. ఆ తర్వాత వెంటనే లేచి ఓవర్ పూర్తి చేసేయగా.. సర్ఫరాజ్ కూడా బ్యాటింగ్ చేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ ఇందులో రషీద్ కు ఏ మాత్రం గాయమైనా సరే గుజరాత్ పై గట్టిగానే ఎఫెక్ట్ పడి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ఇన్సిడెంట్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.