ప్రస్తుతం రషీద్ ఖాన్ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. అదేంటి ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉందనుకుంటున్నారా ?అదేం కాదు. మరి ఎక్కడ ఆడుతున్నాడో తెలియాలంటే కింద చదివేయాల్సిందే.
స్టార్ క్రికెటర్లను చూడాలంటే అది గ్రౌండ్ లోనే సాధ్యం. వారిని కలవాలంటే మాత్రం దాదాపు అసాధ్యం. ఇక వారితో కలిసి ఆడాలంటే అది కలలో మాత్రమే జరుగుతుంది. కానీ జైపూర్ అభిమానులకు ఆ అదృష్టం కలిసొచ్చింది. ఏకంగా అంతర్జాతీయ అగ్ర స్పిన్నర్ అయినటువంటి రషీద్ ఖాన్ తో ఆడే అవకాశం వచ్చింది. సాధారణంగా ఒక్కసారి స్టార్ క్రికెటర్ అయిన తర్వాత గల్లీ క్రికెట్ ఆడరు. కానీ అరుదులో అరుదుగా ఫ్యాన్స్ కోసం ఇలా ఆడడం ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం. ప్రపంచంలోనే అగ్ర స్పిన్నర్ రషీద్ ఖాన్ తన గొప్ప మనసుతో ఫ్యాన్స్ కోసం తో క్రికెట్ ఆడుతూ సందడి చేసాడు.
ఐపీఎల్ లో భాగంగా రేపు గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జైపూర్ చేరుకున్న గుజరాత్ టీమ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది. ఈ క్రమంలో కొంతమంది ప్లేయర్లు సరదాగా చిల్ అవుతూ కనిపించారు. ఇందులో భాగంగా రషీద్ ఖాన్ గల్లీ క్రికెట్ ఆడుతూ అందరిని సర్ ప్రైజ్ చేసాడు. అయితే గ్రౌండ్ లో తన బౌలింగ్ తో అదరగొట్టే రషీద్ ఖాన్ ఇక్కడ మాత్రం బ్యాటింగ్ లో బౌండరీల వర్షం కురిపించడం విశేషం. ఇక రషీద్ ఖాన్ ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 9మ్యాచులాడిన రషీద్ ఖాన్ 15 వికెట్లు తీసాడు. ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచులో 6 మ్యాచుల్లో విజయం సాధించింది. మరి రషీద్ ఇలా గల్లీ క్రికెట్లో బ్యాటింగ్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Rashid Khan playing street cricket with the Indian fans.
One of the most humble characters of the game! pic.twitter.com/3IelrQA11M
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2023