శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు రామ్ చరణ్. పాల్గొనడమే కాదు.. అదే సమ్మిట్లో జపాన్ పై తనకున్న ప్రేమను కాస్త హ్యూమరస్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.రామ్ చరణ్ దంపతులు త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా తను తండ్రి కావడంపై కూడా ఇలాంటి హ్యూమర్ కామెంటే చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కానీ అప్పటినుంచి చరణ్ ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, పలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి హాజరు కావడం ద్వారా అభిమానులని ఏదో ఒక రకంగా పలకరిస్తున్నారు. తాజాగా జపాన్ మ్యాగజిన్ పై ఎన్టీఆర్ తో పాటు చరణ్ ఫోటో చిత్రించడం దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఇక ఇటీవలే జీ-20 సమ్మిట్ లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న చరణ్.. జపాన్ మీద తన ప్రేమను తెలియజేశాడు. ఇక తనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పుకొచ్చాడు.
శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు రామ్ చరణ్. పాల్గొనడమే కాదు.. అదే సమ్మిట్లో జపాన్ పై తనకున్న ప్రేమను కాస్త హ్యూమరస్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.రామ్ చరణ్ దంపతులు త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అభిమానులని ఎంతో సంతోషానికి గురి చేసింది.చూడడానికి రాం చరణ్ చాలా సింపుల్ గా కనిపిస్తాడు. కానీ తన హ్యూమర్ తో మాత్రం అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంటారు. ఏ విషయంలోనైనా తనదైన శైలిలో అభిమానులని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. సీరియస్ విషయంలోనూ.. హ్యూమర్ ఉండేలా.. ఎదుటి వారిని ఎంటర్ టైన్ చేసేలా చేస్తుంటారు. ఇక తాజాగా తను తండ్రి కావడంపై కూడా ఇలాంటి హ్యూమర్ కామెంటే చేశారు.
ఇక తాజాగా తను తండ్రి కావడంపై కూడా ఇలాంటి హ్యూమర్ కామెంటే చేశారు. తనకు పుట్టబోయే బిడ్డ గురించి చరణ్ తన మనసులో విషయాలను పంచుకుంటూ.. ” నాకు జపాన్ అంటే చాలా ఇష్టం. నాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ కి సంబంధముంది. ఈ మ్యాజిక్ అంతా అక్కడే జరిగింది. అందుకే జపాన్ అంటే నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. అని The Boys అనే ట్యాగ్ తో కామెంట్ చేసాడు. మరి చరణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.