Suresh Raina: అద్భుతంగా కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను ఆడుతున్నాడంటూ కితాబిచ్చాడు. చక్కటి ఫుట్ వర్క్‌తో భారీ షాట్లను ఆడగలుగుతున్నాడని, బ్యాట్‌ను బాడీకి దగ్గరగా ఉంచుకుని ఆడే అతని బ్యాటింగ్ టెక్నిక్ బాగుందని రైనా చెప్పుకొచ్చాడు.
టీమిండియాకి కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో రెగ్యులర్ ఓపెనర్ ఉన్నాడు. అతనికి వన్డే, టెస్టులో శుబ్‌మన్ గిల్, టీ20ల్లో ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ పార్ట్నర్లుగా ఉన్నారు. అయితే.. టీ20ల్లో ఇషాన్ కిషాన్ ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదు. గిల్‌ను సైతం టీ20 ఓపెనర్‌గా ట్రై చేశారు. అయితే.. తాజాగా టీమిండియాకు అద్భుతమైన ఓపెనర్ దొరికేశాడంటూ.. భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అంటున్నాడు. ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. అదరగొడుతున్న యశస్వి జైస్వాల్‌పై రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. భారతకు మంచి ఓపెనర్ దొరికేశాడంటూ పేర్కొన్నాడు.
జైస్వాల్ బ్యాటింగ్‌కు రైనా ఫిదా అయిపోయినట్లు ఉన్నాడు. అద్భుతంగా కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను ఆడుతున్నాడంటూ కితాబిచ్చాడు. చక్కటి ఫుట్ వర్క్‌తో భారీ షాట్లను ఆడగలుగుతున్నాడని, బ్యాట్‌ను బాడీకి దగ్గరగా ఉంచుకుని ఆడే జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుందని చెప్పుకొచ్చాడు. చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే త్వరలోనే టీమిండియాలో స్టార్‌గా మారతాడని, అతన్ని టీమిండియాలోకి తీసుకోవాలని అన్నాడు. పవర్ ప్లేలో అవుట్ కాకుండా ఆడుతూనే.. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడని, ఓ ఓపెనర్‌కు ఉండాల్సిన గొప్ప లక్షణం ఇదేనని రైనా పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గురువారం జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ ఆరంభం నుంచి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జైస్వాల్ స్పీడ్ చూసి.. మరో ఎండ్‌లో బట్లర్ సైతం సైలెంట్ అయిపోయాడు. జైస్వాల్ కొట్టుడు చూసి.. అతనికే ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. కేవలం 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సులతో 77 పరుగులు చేసి రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి.. భారీ స్కోర్ అందించాడు. బదులుగా చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి 32 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో జైస్వాల్ బ్యాటింగ్‌తో పాటు, రైనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yashasvi Jaiswal is a superstar and will make the country proud in future says Suresh Raina#YashasviJaiswal #sureshraina #IPL2023
— Punjab Kesari- Sports (@SportsKesari) April 28, 2023