ధోనీ రిటైర్మెంట్ పై వాళ్లు వీళ్లు కాదు అతడు ఆప్తమిత్రుడు రైనా క్లారిటీ ఇచ్చేశాడు. మొన్న మ్యాచ్ సందర్భంగా ధోనీని కలిసినప్పుడు తనకు ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడని అన్నాడు. ఇంతకీ ఏంటది?
చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే అందరికీ ధోనీనే గుర్తొస్తాడు. ఇతడు కాకుండా మరో పేరు చెప్పమని ఫ్యాన్స్ ని అడిగితే.. కచ్చితంగా చెప్పే పేరు సురేష్ రైనా. సీఎస్కేకి ఆడినన్నీ రోజులు ధోనీకి తోడునీడలా ఉన్న రైనా.. ఎన్నో మ్యాచుల్ని ఒంటిచేత్తో గెలిపించాడు. టీమిండియా తరఫున కూడా ధోనీ కెప్టెన్సీలో ఆడి అద్భుతమైన క్రికెటర్, ఫీల్డర్, ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి రైనా ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్వయంగా మహీనే తనతో ఆ విషయం గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని గత కొన్నిరోజుల నుంచి ఓ తెగ గాసిప్స్ వచ్చాయి. అది నిజమేనా అన్నట్లు చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే ఆ స్టేడియం అంతా సీఎస్కే ఫ్యాన్స్ తో నిండిపోతుంది. తాజాగా తన రిటైర్మెంట్ పై ధోనీ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. టాస్ సందర్భంగా హోస్ట్ డానీ మోరిసన్.. ‘ఇదే మీ చివరి సీజన్ కదా?’ అని అడగ్గా.. ‘అలా మీరు డిసైడ్ అయ్యారు’ అని ధోనీ సమాధానమిచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయిపోయారు. అయితే ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడుతాడు కదా అని హమ్మయ్యా అనుకున్నారు. ఇప్పుడు రైనా చెప్పింది వింటే ఎగిరి గంతేసినంత పనిచేస్తారు.
ఎందుకంటే ప్రస్తుత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి ఊపు మీద కనిపిస్తోంది. 11 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా మూడు మ్యాచులు మిగిలున్నాయి. వాటిలో ఏవైనా రెండు గెలిస్తే చాలు. క్వాలిఫయర్స్ లో అడుగుపెట్టేస్తుంది. కాస్త బాగా ఆడితే కప్ కొట్టినాసరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తాజాగా ముంబయితో జరిగిపోయిన మ్యాచ్ సందర్భంగా చెపాక్ లో ధోనీ-రైనా కలిసి సందడి చేశారు. అప్పుడు.. ‘ఈ ఏడాది ట్రోఫీ గెలిచి మరో ఏడాది ఆడతాను’ అని ధోనీ తనతో అన్నట్లు రైనా చెప్పుకొచ్చాడు. దీంతో ధోనీ టార్గెట్ ఈసారి కప్ కొట్టడమే అని అర్ధమైపోయింది. సో అదన్నమాట విషయం చెన్నైకి ఐదో కప్ అందించి ధోనీ రిటైర్ కావాలని ప్లాన్ వేసినట్లున్నాడు. మరి ధోనీ ప్లానింగ్ పై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.