ఐపీఎల్ లో మరో రెండు మ్యాచులే మిగిలి ఉన్నాయి. ఒకటి ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్. మరొకటి నేడు(శుక్రవారం) జరగబోయే క్వాలిఫయర్ 2. అయితే ఈ మ్యాచుకి వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే మ్యాచ్ రద్దవుతుంది. దీంతో ఏ జట్టు ఫైనల్ కి వెళ్తుందనే సందేహం అందరిలో నెలకొంది.
ఐపీఎల్ లో నేడు మరో సమరానికి తెరలేవనుంది. క్వాలిఫయర్ 2లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు తలపడుతుంది. నేడు జరిగే మ్యాచ్ ఒక రకంగా సెమీ ఫైనల్ లాంటిది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్యహోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కి అహ్మదాబాద్ ఆతిధ్యమివ్వబోతుంది. అయితే ఈ మ్యాచుకి వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే మ్యాచ్ రద్దవుతుంది. దీంతో ఏ జట్టు ఫైనల్ కి వెళ్తుందనే సందేహం అందరిలో నెలకొంది.
ఐపీఎల్ లో మరో రెండు మ్యాచులే మిగిలి ఉన్నాయి. ఒకటి ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్. మరొకటి నేడు(శుక్రవారం) జరగబోయే క్వాలిఫయర్ 2. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 1 లో గుజరాత్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్ బెర్త్ కంఫర్మ్ చేసుకోగా.. నేడు జరిగే క్వాలిఫయర్ 2 లో ముంబై, గుజరాత్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జయింట్స్ మీద ఎలిమినేటర్ మ్యాచులో భారీ విజయం సాధించగా.. గుజరాత్ క్వాలిఫయర్ 1 లో చెన్నై మీద ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు వర్షం మ్యాచ్ కి అంతరాయం కలిగించేలా ఉంది. శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ పరిసరాల్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ.. మ్యాచ్‌పై ప్రభావం చూపేంతగా వర్షం పడకపోవచ్చని వాతావరణ శాఖ చెప్తోంది.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కి వెళ్లనుంది. ఎప్పటి నుంచో చాలా లీగ్ ల్లో అంతర్జాతీయ మ్యాచుల్లో ఇదే రూల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇక ఈ సీజన్ లో 14 మ్యాచులాడిన గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచుల్లో విజయం సాధించి అగ్రస్థానంలో ఉండగా.. మరోవైపు ముంబయి ఇండియన్స్ 14 మ్యాచ్‌లాడి కేవలం 8 మ్యాచ్‌ల్లో గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లెక్కన నేటి మ్యాచులో వర్షం పడితే గుజరాత్ ఫైనల్ కి దూసుకెళ్తుంది. మరి ఈ మ్యాచ్ కి వర్షం పడుతుందో.. లేకపోతే మ్యాచ్ జరుగుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.