ఐపీఎల్ 2023 లో నేటితో(ఆదివారం) లీగ్ మ్యాచులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న ఒక్క స్థానం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ నెలకొంది. ఈ మూడు జట్లలో బెంగళూరు జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్సీబీ జట్టుకి ఒక కొత్త టెన్షన్ మొదలైంది.
ఐపీఎల్ 2023 లో నేటితో(ఆదివారం) లీగ్ మ్యాచులు పూర్తి కానున్నాయి. ఈ రోజు జరిగే రెండు మ్యాచులతో ఈ సీజన్ లీగ్ మ్యాచులకి ఎండ్ కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కి వెళ్లే మిగిలిన ఒక్క జట్టేదో నేడు తేలిపోనుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో అందరికంటే ముందుగా ప్లే ఆఫ్ బెర్త్ కంఫర్మ్ చేసుకోగా.. నిన్న తమ చివరి లీగ్ మ్యాచుల్లో చెన్నైతో పాటుగా లక్నో కూడా విజయం సాధించి ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో ఉన్న ఒక్క స్థానం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ నెలకొంది. ఈ మూడు జట్లలో బెంగళూరు జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్సీబీ జట్టుకి ఒక కొత్త టెన్షన్ మొదలైంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఉన్న ఒక్క ప్లే ఆఫ్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లకు కూడా ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. అయితే రాజస్థాన్ తమ లీగ్ మ్యాచులన్నీ ముగించుకోగా.. ఆర్సీబీ, ముంబై మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. వీటిలో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే.. ఆర్సీబీ, ముంబై తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఖచ్చితంగా ఓడిపోవాలి. ఇక ముంబైకి భారీగా నెట్ రన్ రేట్ మైనస్ ల్లో ఉండడంతో చివరి మ్యాచులో గెలవడంతో పాటు.. ఆర్సీబీ గుజరాత్ మీద ఓడిపోవాలి.
మిగిలిన రెండు జట్లతో పోలిస్తే నెట్ రన్ రేట్ ఆర్సీబీకి ఎక్కువగా ఉండడం, పైగా ఒక మ్యాచ్ మిగిలి ఉండడంతో ఆర్సీఈబీ గెలిస్తే ప్లే ఆఫ్ కి వెళ్ళినట్లే అని భావించారు. కానీ ఈ రోజు బెంగళూరులో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. దీని ప్రకరాం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని ACC WHEATHER చూపిస్తుంది. ఇదే జరిగితే ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. దీంతో ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్ ని నార్మల్ గా గెలిచినా.. ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్ కి వెళ్ళిపోతుంది. మొత్తానికి వర్షం పడితే ఇటు ఆర్సీబీతో పాటుగా అటు రాజస్థాన్ కి కూడా నష్టమే. మరి వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.