ఐపీఎల్ ఫైనల్.. తొలిసారి రిజర్వ్ డేకి మారింది. అందరూ మ్యాచ్ జరిగితే చాలనుకుంటున్నారు. ధోనీ ఫ్యాన్స్ మాత్రం వర్షం దెబ్బకు కంగారూపడుతున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఐపీఎల్ ని ప్రతి ఏడాది సమ్మర్ లో జరుపుతారు. అందుకు తగ్గట్లే మ్యాచులన్నీ కూడా యమ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంటాయి. ఈసారి కూడా అంతకుమించి అనేలా జరిగాయి. ప్లే ఆఫ్స్ లోనూ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కట్ చేస్తే చెన్నై, గుజరాత్ జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగాలి. కానీ అహ్మదాబాద్ స్టేడియాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కనీసం టాస్ కూడా పడనీయకుండా చేసింది. దీంతో సోమవారాన్ని రిజర్వ్ డేగా ప్రకటించారు. దీనిపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు ఒక్క ధోనీ ఫ్యాన్స్ కి తప్ప. మ్యాచ్ తేదీ మారిందనేసరికి వాళ్లు భయపడుతున్నారు. దానికి ఓ కారణముంది. ఇంతకీ అదేంటో తెలుసా?
ఇక విషయానికొచ్చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది దారుణమైన ఫెర్ఫార్మెన్స్ చేసింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందా అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాల్ని తలకిందులు చేస్తూ పాయింట్ల పట్టికలో 2వ ప్లేసులో నిలిచింది. ఈసారి ఫైనల్ లో ముందే అడుగుపెట్టేసింది. అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో చెన్నై vs గుజరాత్ ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా అది రిజర్వ్ డేకి వాయిదా పడింది. గతంలో ధోనీ.. టీమిండియాకు ఆడిన చివరి మ్యాచ్ కు కూడా ఇలానే వర్షం ఇబ్బంది పెట్టింది. దీంతో ధోనీ ఫ్యాన్స్ కి కంగారు మొదలైంది.
ఎందుకంటే ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్. న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో ధోనీ 50 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. వర్షం ఈ మ్యాచ్ రెండు రోజులు జరిగింది. కానీ టీమిండియా ఓడిపోయింది. దీని తర్వాత మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ధోనీ.. 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ లోనూ దాదాపు ఇదే సీన్ రిపీటైంది. ఇప్పుడిదే ఫ్యాన్స్ ని కంగారూ పెడుతంది. ఆరోజు జరిగినట్లు అస్సలు జరగకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. ఎలాగైనా సరే సీఎస్కే కప్ కొట్టాలని కోరుకుంటున్నారు. సో అదనమాట విషయం. మరి ఫైనల్లో ఏం జరగొచ్చని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Déjà Vu?
📸: IPL#MSDhoni #India #CSK pic.twitter.com/4cW5RlhFBb
— CricTracker (@Cricketracker) May 28, 2023