Rahul Tewatia: కొన్ని సార్లు అసాధ్యం అనుకున్న మ్యాచులు కూడా తన బ్యాటింగ్ తో సుసాధ్యం చేసాడు. వీటిలో కొన్ని గమనిస్తే పంజాబ్ మీదే ఎక్కువగా ఉండడం విశేషం. పంజాబ్ అంటే పూనకం వచ్చేలా ఆడే తెవాటియా.. ఆ జట్టు మీద చెలరేగి ఆడడం ఇదే తొలిసారి కాదు.
టీంలో ఒక ఆటగాడు ప్రత్యర్థి నుండి మ్యాచ్ లాగేసుకున్నాడంటే వావ్ అనకుండా ఉండలేం. కానీ అదే ఆటగాడు పదే పదే ఒకే జట్టుపై ఆధిపత్యం చూపిస్తూ.. తమ జట్టుకి విజయాన్ని అందించడమనేది చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన నిన్న ఐపీఎల్ మ్యాచ్ లో జరిగింది. బాధించబడిన జట్టు పంజాబ్ కింగ్స్ అయితే.. బాధించిన వ్యక్తి రాహుల్ తెవాటియా. ఐపీఎల్ లో గత నాలుగు రోజులుగా వరుస పెట్టి థ్రిల్లింగ్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా క్రికెట్ ప్రేమికులకు మంచి కిక్ ఇచ్చాయి. మ్యాచ్ ఆధ్యాంతం గుజరాత్ చేతిలో ఉన్నా.. చివరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కానీ తెవాటియా ఫోర్ కొట్టి హార్దిక్ సేనకు విజయాన్ని అందించాడు. బౌండరీతో మ్యాచ్ ముగించడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. ఆసక్తికరమైన విషయం ఒకటి చోటు చేసుకుంది.
గత రెండేళ్లుగా అద్భుత ఇన్నింగ్స్ లు ఆడుతూ గ్రేట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు రాహుల్ తెవాటియా. ఈ క్రమంలో ఎన్నో మ్యాచ్ లు గెలిపించిన ఈ గుజరాత్ బ్యాటర్.. కొన్ని సార్లు అసాధ్యం అనుకున్న మ్యాచులు కూడా తన బ్యాటింగ్ తో సుసాధ్యం చేసాడు. వీటిలో కొన్ని గమనిస్తే పంజాబ్ మీదే ఎక్కువగా ఉండడం విశేషం. పంజాబ్ అంటే పూనకం వచ్చేలా ఆడే తెవాటియా.. ఆ జట్టు మీద చెలరేగి ఆడడం ఇదే తొలిసారి కాదు. 2020 లో రాజస్థాన్ జట్టుకి ఆడాడు తెవాటియా. జట్టు విజయానికి చివరి 3 ఓవర్లలో 51 పరుగులు కావసిన దశలో కాట్రేల్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 5 సిక్సులు కొట్టి మ్యాచ్ ని ఏకపక్షం చేసేసాడు. ఇక గతేడాది గుజరాత్ టైటాన్స్ టీమ్ లోకి అడుగు పెట్టాడు తెవాటియా. చివరి 2 బంతులకి 12 పరుగులు అవసరం కాగా..రెండు సిక్సులు కొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సారి ప్రత్యర్థి కూడా పంజాబ్ కావడం విశేషం.
ఇక తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 2 బంతుల్లో 4 పరుగులు కొట్టాల్సిన తరుణంలో ఫైన్ లెగ్ వైపుగా స్కూప్ షాట్ ఆడి ఫోర్ కొట్టాడు. దీంతో పంజాబ్ జట్టుకి ఓటమి తప్పలేదు. గెలుస్తాం అనుకున్న ప్రతి సారి తెవాటియా పంజాబ్ జట్టుకి ఊహించని విధంగా షాకిస్తున్నాడు. అందరికీ తెవాటియా ఇన్నింగ్స్ అలరించినా.. పంజాబ్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. జట్టులో ఎవ్వరు కూడా అర్ధ సెంచరీ చేయలేదు. 36 పరుగులు చేసిన షార్ట్ ఆ జట్టులో టాప్ స్కోరర్. ఇక ఒక మాదిరి లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ గిల్ చివరివరకు నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక చివరి ఓవర్లో 7 పరుగులు అవసరైన దశలో గిల్ ఔటైనా.. తెవాటియా మ్యాచ్ ని ఫినిష్ చేసాడు. మొత్తానికి తెవాటియా ఇన్నింగ్స్ మరొకసారి పంజాబ్ జట్టుకి పీడకలనే మిగిలించింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Rahul Tewatia ❤️ finishing the job against Punjab Kings #PBKSvGT #IPL2023 pic.twitter.com/0GVs4iPBB9
— ESPNcricinfo (@ESPNcricinfo) April 13, 2023