ఐపీఎల్ అంటే కుర్రాళ్ల టోర్నీ అనుకుంటారు. అలాంటిది పనయిపోయింది అనుకున్న రహానె.. ఈ సీజన్ లో రప్ఫాడిస్తున్నాడు. బ్యాటింగ్ తోపాటు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు.
ఐపీఎల్ లో ఎవరూ ఎప్పుడు స్టార్ అయిపోతారనేది అస్సలు ఊహించలేం. ఈసారి అలానే జరుగుతోంది. వీళ్ల పని అయిపోయింది, ఏం ఆడతారులే అనుకున్న సీనియర్ క్రికెటర్లు అందరూ అదిరిపోయే రేంజులో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. రెచ్చిపోయి బ్యాటుతో రఫ్ఫాడిస్తున్నాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతున్న రహానె మాత్రం ప్రతి ఒక్కరినీ తన బ్యాటింగ్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. క్రికెట్ లో KCPD అనే పదానికి రియాలిటీలో డెఫినిషన్ చూపిస్తున్నాడు. దీనికి తోడు ఇప్పుడు రహానె కామెంట్స్ ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.
అసలు విషయానికొస్తే.. రహానె పేరు చెప్పగానే హా ఏముంది టెస్టు బ్యాటర్, వన్డే-టీ20లకు పనికిరాడు అని చాలామంది ట్రోల్స్ చేశారు. అందుకు తగ్గట్లే ఈసారి ఐపీఎల్ వేలంలో ఫస్ట్ ఫస్ట్ అతడిని ఎవరూ తీసుకోలేదు. ఫైనల్ గా రహానెని చెన్నై దక్కించుకుంది. కనీస ధర రూ.50 లక్షలకే సొంతం చేసుకుంది. ఇప్పుడు పెట్టిన ప్రతి రూపాయికి రహానె పూర్తి న్యాయం చేస్తున్నాడు. బౌలర్ తో సంబంధం లేకుండా అందరినీ ఉతికి ఆరేస్తున్నాడు. అయినా సరే ఇంకా ఆకలి తీరినట్లు లేదు. ముందు ముందు అసలు సినిమా చూపిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నేను గేమ్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని మ్యాచుల్లో బ్యాటింగ్ ని నేను ఆస్వాదిస్తున్నాను. అయితే నాలోని ఇంకా అసలు సత్తా బయటకు రావాస్ ఇస్తుంది. ధోనీ కెప్టెన్సీ అప్పుడు టీమిండియా తరఫున, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ చాలా నేర్చుకుంటున్నాను. మహీ భాయ్ చెప్పింది ఏదైనా సరే మీరు కరెక్ట్ గా వింటే చాలు మీ ప్రదర్శన మెరుగుపడుతుంది’ అని రహానె చెప్పుకొచ్చాడు. ఇతడి మాటల ప్రకారం చూస్తుంటే.. ఐపీఎల్ చెన్నై ఆడబోయే మిగతా మ్యాచుల్లో ముసళ్ల పండగ, అసలు సినిమా చూపించడం గ్యారంటీ. మరి రహానె బ్యాటింగ్, మాట్లాడిన దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Ajinkya Rahane said, “my best is yet to come”. pic.twitter.com/FPOWabmwAf
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2023