లక్నో చేతిలో పంజాబ్ ఓడిపోయింది. ఇది అందరికీ తెలుసు. కానీ పంజాబ్ జట్టు చేసిన ఆ ఒక్క తప్పు వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఈ ఐపీఎల్ లోనే మోస్ట్ క్రేజీ అంటే క్రేజీ మ్యాచ్ శుక్రవారం రాత్రి జరిగింది. ఆడినవి పెద్ద జట్లు కాకపోవడం వల్ల సోషల్ మీడియాలో పెద్దగా బజ్ లేదు. చెప్పాలంటే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ టోర్నీలో రెండో హైయస్ట్ స్కోరు చేసిన లక్నో రికార్డు క్రియేట్ చేయగా.. పంజాబ్ దాన్ని ఛేదించలేకపోయింది. దీంతో లక్నో 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే పంజాబ్ చేసిన ఆ ఒక్క తప్పు.. మ్యాచ్ లో ఓటమికి కారణమైందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ తాజా సీజన్ లో ఇప్పటివరకు 8 మ్యాచులాడిన లక్నో, ఐదు మ్యాచుల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా పంజాబ్ పై ఏకంగా 257/5 పరుగుల భారీ స్కోరు చేసింది. కైల్ మేయర్స్ 54, బదోని 43, స్టోయినిస్ 72, పూరన్ 45.. విధ్వంసకర బ్యాటింగ్ తో.. ఐపీఎల్ లో లక్నో రెండో అత్యధిక స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో పంజాబ్ బాగా పోరాడింది కానీ 201 పరుగులకు ఆలౌటై, ఓడిపోయింది.
అయితే పంజాబ్ చేసిన ఒక్క పొరపాటు.. లక్నో ఇంత భారీ స్కోరు చేయడానికి, గెలవడానికి కారణమని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అదే కేఎల్ రాహుల్ ని ఔట్ చేయడం, వినడానికి కాస్త ఫన్నీగా అనిపించొచ్చు కానీ ఇదే నిజం. లక్నో గత మ్యాచే దీనికి ఉదాహరణ. కేఎల్ రాహుల్ చివరవరకు ఉండి జిడ్డు బ్యాటింగ్ చేయడం లక్నో ఓటమికి కారమణమైంది. అంతకు ముందు ఇదే సీజన్ లో పంజాబ్ తో మ్యాచ్ లో రాహుల్ చివరవరకు ఉండి 74 రన్స్ కొట్టాడు. ఆరోజు పంజాబ్ గెలిచింది. ఈ రోజు రాహుల్ ప్రారంభంలోనే ఔటయ్యాడు. పంజాబ్ ఓడిపోయింది. సో అదన్నమాట విషయం. ఒకవేళ రాహుల్ ని ఔట్ చేయకుండా పంజాబ్ ఉండుంటే.. ఈ మ్యాచ్ లోనూ గెలిచేదేమో! మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
You will never know what a batting side can do when you make it easy for them by getting KL Rahul out very early in the innings.
Never get him out and let him chase the Orange Cap.#KLRahul #LSGvPBKS #IPL2023 pic.twitter.com/PxUiytUeSw
— Nirmal Jyothi (@majornirmal) April 28, 2023