Rohit Sharma: అతనొక్కడికే ఆరు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. ఒకటి దక్కన్ ఛార్జెర్స్ టీమ్‌తో గెలిచింది. మిగిలిన నాలుగు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా గెలిచినవి.. కానీ, పంజాబ్‌కు
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తిరిగి ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. దాదాపు కప్పు కొట్టిన ప్రతి సీజన్‌లో ముంబై ఆరంభ మ్యాచ్‌ల్లో ఓడి.. తర్వాత పుంజుకుని ఛాంపియన్‌లా నిలిస్తుంది. ప్రస్తుతం ముంబై ఆడుతున్న తీరు చూస్తుంటే ఆరో కప్పు ఖాయంలా కనిపిస్తోంది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల భారీ టార్గెట్‌ణు కేవలం 18.5 ఓవర్లలోనే ఛేదించి.. ముంబై బ్యాటింగ్ సత్తా ఏంటో చాటింది. పైగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయినా ముంబై ఇంత పెద్ద టార్గెట్ ఛేదించడం విశేషం.
అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయిన తర్వాత.. పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా విభాగం.. ట్విట్టర్‌లో రోహిత్ 0 పరుగులకే అవుట్ అయ్యాడని నవ్వుతున్న ఎమోజీ పెట్టి ట్రోల్ చేసింది. ఈ ట్విట్‌కు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా టీమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది. రోహిత్ పక్కన సున్నా పెట్టిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 0, పంజాబ్ కింగ్స్ 0. రోహిత్ శర్మ 6 అంటూ పోస్టు చేసింది. దాని అర్థం ఈ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ కావచ్చు కానీ.. అతనొక్కడికే ఆరు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. ఒకటి దక్కన్ ఛార్జెర్స్ టీమ్‌తో గెలిచింది. మిగిలిన నాలుగు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా గెలిచినవి.. కానీ, పంజాబ్‌కు 16 ఐపీఎల్ సీజన్స్‌లో ఒక్కటంటే ఒక్క ట్రోఫీ కూడా లేదంటూ ముంబై ఇండియన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇవి ఐపీఎల్ టీమ్స్ మధ్య సరదాగా జరిగే విషయాలే. కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో రాణించాడు. అలాగే జితేష్ శర్మ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో చివరల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి విజయం సాధించింది. ఇషాన్ కిషన్ 75, సూర్యకుమార్ యాదవ్ 66 రాణించగా.. చివర్లో టిమ్ డేవిడ్ 10 బంతుల్లో 19, తిలక్ వర్మ 10 బంతుల్లో 26 పరుగులు చేసి గెలిపించారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌పై పంజాబ్ ట్రోలింగ్‌తో పాటు ముంబై కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mumbai Indians responded to Punjab Kings’ banter after Rohit Sharma was dismissed for a duck 😋#PBKSvMI #PBKSvsMI pic.twitter.com/dpgN9xV0eN
— Cricket.com (@weRcricket) May 3, 2023