భారత యువ ఆటగాడు పృథ్వీ షాపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్-2023లో ఘోరంగా ఫెయిల్ అవ్వడం, మరోవైపు సహచర ప్లేయర్ శుబ్‌మన్ గిల్ నీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు బాదుతుండటంతో అందరూ పృథ్వీ షాను టార్గెట్ చేస్తున్నారు.
ఐపీఎల్ పదహారో సీజన్లో టీమిండియా యంగ్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో మొత్తం 8 మ్యాచుల్లో బరిలోకి దిగిన షా.. కేవలం 106 రన్స్ మాత్రమే చేశాడు. అతడు ఈ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. దీంతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని పృథ్వీ షా చేజేతులా సంక్లిష్టం చేసుకున్నాడు. ఈ టోర్నీలో అతడి బ్యాటింగ్ అప్రోచ్, పేలవమైన షాట్ సెలక్షన్‌పై సీనియర్ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. అతడు ఇలాగే ఆడితే ఇక భారత జట్టులోకి రావడం కష్టమేనని అంటున్నారు. సహచర ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో పృథ్వీ షాను పోలుస్తున్నారు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ గిల్ దూసుకెళ్తున్నాడని చెబుతున్నారు. అటు ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు ఇటు ఐపీఎల్‌లోనూ వరుస సెంచరీలు బాదుతున్న గిల్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని మెచ్చుకుంటున్నారు
పృథ్వీ షాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. కెరీర్‌ను అతడు సీరియస్‌గా తీసుకోవడం లేదని చెబుతున్నారు. గిల్లా దృఢ నిశ్చయంతో ఆడితే పృథ్వీ కూడా సంచనాలు సృష్టిస్తాడని అంటున్నారు. కానీ అతడు మాత్రం కెరీర్ కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడని మండిపడుతున్నారు. ఒకవైపు గిల్ వరుస సెంచరీలు బాదుతుంటే.. మరోవైపు పృథ్వీ షా మాత్రం గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి ఎంజాయ్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇలా అయితే పృథ్వీ మూటాముళ్ల సర్దుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. కాగా, పృథ్వీ షా తన ప్రేయసి నిధి తపాడియాతో కలసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఐఐఎఫ్ఏ-2023 అవార్డుల వేడుకలో షా.. నిధితో కలసి సందడి చేశాడు. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
We thought Prithvi Shaw would be a major deal in world cricket, but it doesn’t appear to be. On the other hand, Gill is hitting centuries and other side Prithivi is attending award shows. We have sachin-kambli in this generation as well.
— Vipin Tiwari (@vipintiwari952) May 27, 2023