Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కీ ప్లేయర్‌గా పృథ్వీ షాకు పేరుంది. కానీ.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అతనికి ఘోర అవమానం జరిగింది.
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ఎలాగైన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. ఐపీఎల్ 2023లో తొలి గెలుపు నమోదు చేయాలని భావిస్తోంది. అందుకోసం తుది జట్టులో భారీ మార్పులతో రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో చాలా మంది ఆటగాళ్లను పక్కనపెట్టిన ఢిల్లీ వారి స్థానంలో ఇతర ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకుంది.
అయితే.. స్టార్ ఓపెనర్ పృథ్వీ షాను సైతం ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పక్కనపెట్టాడు. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురిచేసినా.. రెండు మ్యాచ్‌ల్లో విఫలం అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. పృథ్వీ షా స్థానంలో మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే పెళ్లి కోసం స్వదేశానికి వెళ్లిన మార్ష్ స్థానంలో పావెల్‌ను తీసుకున్నారు. అలాగే సర్ఫరాజ్‌ను పక్కనపెట్టి లలిత్ యాదవ్‌ను తీసుకున్నారు. అయితే.. వీరిలో పృథ్వీ షాను పక్కనపెట్టడం కఠిన నిర్ణయంగా కనిపిస్తున్నా.. అందులో పృథ్వీషా స్వయంకృత అపరాధమే ఎక్కువగా ఉంది. తన తోటి ఆటగాళ్లు అన్ని జట్లలో కీలకంగా మారుతున్నా.. పృథ్వీ షా తన ఆటపై దృష్టిపెట్టడం లేదు. దీంతో ఇప్పుడు ఏకంగా తుది జట్టులో స్థానం కోల్పోయాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Prithvi Shaw not in the playing XI. He’s slotted in the impact player list.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023