Prabhsimran Singh: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు వరుస సిక్సులను ఎవరూ మర్చిపోలేరు. అందులోనూ స్ట్రేయిట్‌గా కొట్టిన తొలి సిక్స్ అయితే అద్భుతం. అలాంటి అద్భుతాన్ని మరోసారి రిపీట్ చేశాడు ఓ యువ క్రికెటర్.
టీ20 వరల్డ్ కప్ 2022 సందర్భంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా సాధించిన థ్రిల్లింగ్ విక్టరీని ఏ క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. విరాట్ కోహ్లీ ఆడిన 82 పరుగులు గొప్ప ఇన్నింగ్స్ ప్రతి క్రికెట్ అభిమాని మనసు గెలుచుకుంది. 8 బంతుల్లో 28 పరుగులు సాధించాల్సిన సమయంలో.. పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు అయితే.. భారత క్రికెట్ అభిమానులను భూమ్మిద నిలబడకుండా చేశాయి. అందులోనూ స్ట్రేయిట్‌గా కొట్టిన మొదటి సిక్స్ అయితే.. పాకిస్థాన్ అభిమానులు కూడా మెచ్చుకునే రేంజ్‌లో ఉంది. అలాంటి షాట్‌ను ప్రపంచ క్రికెట్‌లో మరెవరూ ఆడలేరని క్రికెట్ ప్రపంచం ముక్తకఠంతో ఒప్పుకుంది. పాకిస్థాన్ జట్టులో అలాంటి షాట్ ఆడే ఆటగాడే లేడంటూ పాక్ మాజీ క్రికెటర్లు సైతం ఒప్పుకున్నారు. ఆ షాట్ క్రికెట్ బతికి ఉన్నంత కాలం గొప్ప షాట్‌గా నిలిచిపోతుందంటూ ప్రశంసలు అందుకుంది.
అయితే.. అలాంటి అద్భుతమైన షాట్‌ను పోలిన, దాదాపు అలానే ఉన్న షాట్‌ను ఐపీఎల్‌లో ఓ యువ క్రికెటర్ కొట్టాడు. కోహ్లీ కొట్టిన షాట్‌లో ఉన్నంత స్పార్క్ లేకపోయినా.. దాదాపు అలాంటి షాటే. బుధవారం రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్బుత షాట్ చోటు చేసుకుంది. పంజాబ్ యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఈ గొప్ప షాట్‌ను ఆడాడు. అది కూడా ఏ సాదాసీదా బౌలింగ్‌లో కాడు.. ప్రపంచ మేటి పేసర్లలో ఒకడైన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఆడాడు. కళ్లు చెదిరే వేగంతో వేసిన తొలి బంతినే ప్రభ్‌సిమ్రాన్ సింగ్ స్ట్రేయిట్ సిక్స్ కొట్టాడు. ఆ షాట్ చూస్తే.. కోహ్లీ పాకిస్థాన్‌పై హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన సిక్సే గుర్తుకు వస్తుందంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ప్రభ్‌సిమ్రాన్ కేవలం 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేసి.. అదరగొట్టాడు. అతను ఉన్నంతసేపు నిదానంగా ఆడిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్.. ప్రభ్‌సిమ్రాన్ అవుటైన తర్వాత గేరు మార్చాడు. వీళ్లిద్దరూ మంచి స్కోర్లు చేయడంతో పాటు చివర్లో జితేష్ శర్మ 16 బంతుల్లో 27 రన్స్ చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. బదులుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసిన రాజస్థాన్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో పంజాబ్ రెండో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. మరి ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ బ్యాటింగ్‌తో పాటు బౌల్ట్ బౌలింగ్‌లో ఆడిన షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This video on TikTok of Virat Kohli’s six back over Haris Rauf is incredible. #T20WorldCup pic.twitter.com/m9fOb9GVqG
— Lachlan McKirdy (@LMcKirdy7) October 24, 2022
#PrabhsimranSingh #IPL2023 #punjabKings #ViratKohli𓃵 pic.twitter.com/g6NdfYxECV
— Sayyad Nag Pasha (@nag_pasha) April 6, 2023