కొంతమంది స్టార్ ఆటగాళ్లకు ఎక్కడికి వెళ్లినా క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోకే వస్తాడు ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ బ్యాటర్ రికీ పాంటింగ్. ఇదిలా ఉండగా.. తాజాగా పాంటింగ్ పేరు మీద ఒక వైన్ షాప్ ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
కొంతమంది స్టార్ ఆటగాళ్లకు ఎక్కడికి వెళ్లినా క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోకే వస్తాడు ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ బ్యాటర్ రికీ పాంటింగ్. క్రికెట్ లో కొనసాగుతున్నంత కాలం పాంటింగ్ కి తిరుగు లేకుండా పోయింది. ఓ వైపు బ్యాటర్ గా , మరోవైపు కెప్టెన్ గా ఎనలేని కీర్తిని సంపాదించాడు. పాంటింగ్ కి ఆస్ట్రేలియాలో చాలా మనిషి అభిమానులున్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమి లేకపోయినా.. పాంటింగ్ ని ఇప్పుడు మన ఇండియన్స్ కూడా ఇష్టపడుతున్నారు. తాజాగా.. పాంటింగ్ పేరు మీద ఒక వైన్ షాప్ ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కోచ్ గా ఉంటున్నాడు. ఎప్పటినుంచో ఢిల్లీ జట్టులో కోచ్ గా కొనసాగుతున్న పాంటింగ్. ఇక్కడ వారికీ బాగా దగ్గరయ్యాడు. దీంతో చాలా మంది అభిమానులు పాంటింగ్ సంపాదించుకున్నాడు. ఈ అభిమానం కారణంగానే పాంటింగ్ పేరు మీద ఒక వైన్ షాప్ ఓపెన్ చేశారు. అవును మీరు వింటుంది నిజమే. ఢిల్లీలో ఈ మాజీ ఆస్ట్రేలియన్ మీద ఒక వైన్ షాప్ కట్టి ఆ షాప్ కి పాంటింగ్ పేరుని పెట్టడం విశేషం. అంతేకాదు ఈ షాప్ పాంటింగ్ చేతుల మీదుగానే ఓపెన్ చేయడం విశేషం. చుట్టూ పాంటింగ్ ఫోటోలు ఉండడం మరో విశేషం. చూస్తుంటే పాంటింగ్ ని బిజినెస్ కోసం బాగానే వాడుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఐపీఎల్ లో పాంటింగ్ కోచ్ గా ఉంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో అన్ని టీమ్స్ కన్నా ముందుగానే ప్లే ఆఫ్ నుంచి వైదొలగింది. మొత్తానికి ఢిల్లీలో పాంటింగ్ వైన్ షాప్ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.