రింకూ సింగ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ వెనక.. అతడు వాడిన బ్యాట్ వెనక ఓ కథ ఉంది. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే? రింకూ వాడిన బ్యాట్ అతడిది కాదు. మరి ఆ బ్యాట్ ఎవరిది? ఎవరిచ్చారు? ఇప్పుడు తెలుసుకుందాం.
రింకూ సింగ్.. ప్రస్తుతం ఎవరినోట విన్నా.. ఇదే పేరు వినపడుతోంది. ఐపీఎల్ లోనే అత్యంత చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ కోల్ కత్తా క్రికెటర్. అసలు ఆ మ్యాచ్ గణాంకాలు చూస్తే.. కోల్ కత్తా గెలుస్తుందని ఎవరూ ఊహించరు. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఈ యంగ్ ప్లేయర్. చివరి ఐదు బంతులను సిక్స్ లుగా మలిచి కేకేఆర్ కు మరచిపోలేని విజయాన్ని అందించాడు. దాంతో ప్రస్తుతం అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం 21 బంతుల్లోనే 6 సిక్స్ లు, ఓ ఫోర్ తో 48 పరుగులు చేసి కేకేఆర్ టీమ్ కు సంచలన విజయాన్ని అందించాడు. అయితే అతడి ఇన్నింగ్స్ వెనక.. అతడు వాడిన బ్యాట్ కథ ఉంది. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే? రింకూ వాడిన బ్యాట్ అతడిది కాదు. మరి ఆ బ్యాట్ ఎవరిది? ఎవరిచ్చారు.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023లో ఆదివారం జరిగిన మ్యాచ్ అసలు సిసలైన మజాను పంచింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ గుజరాత్ జట్లు తలపడ్డాయి. చివరిదాక ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆ విజయం వెనక ఓ పేరుంది.. అదే రింకూ సింగ్. చివరి ఓవర్లలో కేకేఆర్ జట్టుకు 29 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో కేకేఆర్ టీమ్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా నిరాశలో కూరుకుపోయారు. అయితే నేనున్నాను అంటూ రెచ్చిపోయాడు రింకూ సింగ్. చివరి ఐదు బంతులను స్టాండ్స్ లోకి పంపి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
అయితే ఇక్కడే అతడి బ్యాట్ కు సంబంధించిన కథ వెలుగులోకి వచ్చింది. రింకూ వాడిన బ్యాట్ అతడిది కాదు అని. మరి ఎవరిది ఆ బ్యాట్? ఈ బ్యాట్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా. 5 సిక్స్ లు బాదిన రింకూ వాడిన బ్యాట్ గురించి అతడు మాట్లాడుతూ..”గుజరాత్ తో మ్యాచ్ కోసం రింకూ నా బ్యాట్ ను అడిగాడు. అయితే మెుదటగా నేను అతడికి బ్యాట్ ఇవ్వకూడదు అనుకున్నాను. కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎవరో నా బ్యాట్ ను రింకూకు ఇచ్చారు. ఇక ఈ బ్యాట్ తో రింకూ అదరగొట్టాడు. ఈ గెలుపు సందర్భంగా ఈ లక్కీ బ్యాట్ ను నేను అతడికే ఇస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా.
ఇక ఈ బ్యాట్ ను నితీశ్ ఎప్పటి నుంచో వాడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. గత ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లు ఈ బ్యాట్ తోనే ఆడానని రాణా తెలిపాడు. దాంతో పాటుగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోని చాలా మ్యాచ్ లు, ఈ ఐపీఎల్ లోని తొలి రెండు మ్యాచ్ లు ఇదే బ్యాట్ తో ఆడానని రాణా అన్నాడు. దాంతో 5 సిక్సర్లు బాదిన బ్యాట్ వెనక ఇంత కథ ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయం తెలిసిన అభిమానులు అంతా. మరి సిక్సర్లు బాది జట్టును గెలిపించిన ఆ మ్యాజిక్ బ్యాట్ గురించి రాణా చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
FIVE SIXES IN A ROW 🤯
Rinku Singh, that is sensational! 👏 pic.twitter.com/XjUAy4SKk1
— Sky Sports Cricket (@SkyCricket) April 9, 2023