విజయంపై ఆశలు లేని టైమ్ లో క్రీజ్ లోకి వచ్చిన పూరన్.. ఆర్సీబీ బౌలర్లపై యుద్దాన్ని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు పూరన్. ఇక తనకు లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఓ ఇద్దరి వ్యక్తులకు అంకితం ఇచ్చాడు. మరి ఆ స్పెషల్ పర్సన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 16వ సీజన్ ఫ్యాన్స్ కు అసలైన మజాను పంచుతోంది. రోజురోజుకు మ్యాచ్ ల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ.. దూసుకెళ్తోంది ఈసారి ఐపీఎల్. తాజాగా లక్నో-ఆర్సీబీ మధ్య జరిగిన ఈ మ్యాచ్.. ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రెపింది. ఇక ఈ మ్యాచ్ కు హీరో ఎవరంటే అందరు విండీస్ వీరుడు నికోలస్ పూరన్ అనే చెప్తారు. అంతలా అతడి విధ్వంసం సాగింది మరి. విజయంపై ఆశలు లేని టైమ్ లో క్రీజ్ లోకి వచ్చిన పూరన్.. ఆర్సీబీ బౌలర్లపై యుద్దాన్ని ప్రకటించాడు. భారీ సిక్సర్లలో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు పూరన్. ఇక తనకు లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఓ ఇద్దరి వ్యక్తులకు అంకితం ఇచ్చాడు. మరి ఆ స్పెషల్ పర్సన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
నికోలస్ పూరన్.. ప్రస్తుతం ఐపీఎల్ లో మారుమ్రోగుతున్న పేరు. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో హీరోగా మారాడు పూరన్. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 62 పరుగులు చేసి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ తో ఓడిపోతుంది అనుకున్న లక్నో జట్టు అద్భుతమైన విజయం సాధించింది. పూరన్ తో పాటుగా స్టోయినిస్ కూడా 65 రన్స్ తో చెలరేగాడు. ఇక ఈ మ్యాచ్ లో థండర్ ఇన్నింగ్స్ ఆడిన పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అయితే ఈ అవార్డును తనకు ఇష్టమైన ఇద్దరి వ్యక్తులకు అంకితమిస్తున్నాను అని తెలిపాడు పూరన్. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే? ఒకరు తన భార్య కాగా.. మరొకరు తన ముద్దుల కూతురు. జనవరి 29న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది పూరన్ భార్య. ఇక ఎప్పటి నుంచో వారికి ఓ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్న పూరన్ కు ఈ సందర్భం కలిసొచ్చింది. తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను తన లైఫ్ లో స్పెషల్ పర్సన్స్ అయిన భార్యా, కూతురుకు అంకితం ఇచ్చాడు. దాంతో అభిమానులు పూరన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి పూరన్ అవార్డును తన భార్యా, బిడ్డకు అంకితం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.