Nehal Wadhera: ఐపీఎల్ 2023లో ఓ కుర్రాడు 101 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఇంత పెద్ద సిక్స్ కొట్టిన తొలి భారత క్రికెటర్ అతనే.. అతను సిక్స్ కొడుతుంటే.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తుకు వచ్చాడు..
ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్సుల వర్షం కురవాలని అభిమానులు కోరుకుంటారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ ఐపీఎల్లో కూడా అభిమానులకి కావాల్సినంత వినోదం దొరుకుతుంది. కాకపోతే ఈ సారి మాత్రం తొలి మ్యాచ్ నుండే బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సిక్స్ లు క్రికెట్ ప్రేమికులని ఫిదా చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ ప్లేయర్ నేహాల్ వధేరా కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ పంజాబీ ప్లేయర్ కొట్టిన సిక్స్ వైరల్ గా మారింది.
సిక్సులు ఎవరైనా కొడతారు. కానీ కొన్ని సిక్సులు మాత్రమే అభిమానుల మనసు దోచుకుంటాయి. అబ్బా.. ఏమి కొట్టాడు రా అంటూ ఆకాశానికెత్తేస్తారు. హాఫ్ సెంచరీ చేసినా రాని క్రేజ్.. ఒక్క భారీ సిక్సర్ తో వచ్చేస్తుంది. అలాంటి సంఘటనే నిన్న చిన్న స్వామి స్టేడియంలో ఒకటి చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే.. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై మీద ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ముంబై మిడిల్ ఆర్డర్ ప్లేయర్ నేహాల్ వధేరా 14 ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. స్పిన్నర్ కరణ్ శర్మ వేసిన ఈ ఓవర్లో 3,4 బంతులను సిక్సర్లుగా మలిచిన ఈ యంగ్ ప్లేయర్. వాటిలో ఒక సిక్సర్(4 వ బంతి) మాత్రం భారీగా వెళ్లింది. 101 మీటర్ల ఈ సిక్స్ ఏకంగా స్టేడియం బయట పడింది.
అయితే.. నేహాల్ కొట్టిన ఈ సిక్స్ టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ని గుర్తు చేసింది. దీంతో నెటిజన్లు ఈ పంజాబ్ ప్లేయర్ ని జూనియర్ యువరాజ్ సింగ్ పిలుస్తున్నారు. అంతే కాదు ఈ ఐపీఎల్‌లో 100 మీటర్ల సిక్స్ కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా నేహాల్ నిలిచాడు.పంజాబ్ కి చెందిన నేహాల్ వధేరాకి పెద్దగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. కేవలం 5 మ్యాచ్ లే ఆడిన ఈ యంగ్ ప్లేయర్ కి రెండు సెంచరీలు ఉన్నాయి. వెటరన్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌కు కూడా పంజాబ్‌కు చెందిన ఆటగాడనే విషయం తెలిసిందే. యువీ అంటే భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. సరిగ్గా ఈ లక్షణాలు నేహాల్ వధేరా లో కనిపించడంతో ఇప్పుడు జూనియర్ యువరాజ్ సింగ్ గా ఈ యంగ్ ప్లేయర్ ప్రశంసలు అందుకుంటున్నాడు. యువరాజ్ సింగ్ కూడా గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడడం గమనార్హం. మొత్తానికి భారీ స్కోర్ కొట్టకపోయిన భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు నేహాల్ వధేరా. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nehal Wadhera has arrived in IPL with a stunning 101M six 🤩 pic.twitter.com/sAvbD3fBFl
— CricWatcher (@CricWatcher11) April 2, 2023