ఐపీఎల్ పుణ్యమా అంటూ చాలామంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్లేయర్లు తమ టాలెంట్ నిరూపించుకొని టీంఇండిలోకి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి లిస్టులోకి ఐపీఎల్ స్టార్ రింకు సింగ్ చేరిపోతున్నాడని తెలుస్తుంది.
ఐపీఎల్ పుణ్యమా అంటూ చాలామంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ప్రతి సీజన్ లో ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది ప్లేయర్లు తమ టాలెంట్ నిరూపించుకొని టీంఇండిలోకి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే ఎంత బాగా ఆడినా భారత జట్టులో చోటు సంపాదించుకునేవారు వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, బుమ్రా, హార్దిక్ పాండ్య ఇలా స్టార్ ప్లేయర్లందరూ ఐపీఎల్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అలాంటి లిస్టులోకి ఐపీఎల్ స్టార్ రింకు సింగ్ చేరిపోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే టీమిండియాలోకి ఈ యంగ్ బ్యాటర్ స్థానం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి.
“రింకు సింగ్” ఈ ఏడాది ఐపీఎల్ చూసిన వారికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కోల్ కత్తా తరపున గతేడాది ఐపీఎల్ లో రింకు ఆడిన కొన్ని స్పెషల్ ఇన్నింగ్స్ లు అందరికీ గుర్తుండే ఉంటాయి. వాటిని మించి ఈ సీజన్ లో మాత్రం రింకు ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు ప్రతి మ్యాచులో ఇన్నింగ్స్ ని ఫినిష్ చేస్తూ కేకేఆర్ కి ఎన్నో సంచలన విజయాలనందించాడు. ఈ క్రమంలో గుజరాత్ మీద చివరి 5 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా 5 సిక్సులు కొట్టడంతో పాటు మరి కొన్ని నమ్మశక్యం కానీ ఇన్నింగ్స్ లు ఆడాడు. ఐపీఎల్ లో రింకు సింగ్ యావరేజ్ చూసుకుంటే 150 పైగా ఉంది. అతని స్ట్రైక్ రేట్ అయితే 150 పైగా ఉంది. ఈ నేపథ్యంలో అతనికి భారత జట్టులో పిలుపొచ్చే అవకాశముంది.
ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వన్డే వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ లో యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీతో పాటు.. కెప్టెన్ రోహిత్ శర్మకి కూడా రెస్ట్ ఇవ్వనున్నారని సమాచారం. అదే జరిగితే రింకు సింగ్ టీమిండియాలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా రింకు సింగ్ ని భారత జట్టులో తీసుకోవాల్సిందిగా డిమాండ్స్ వస్తున్నాయి. దానికి తగ్గట్లే సెలెక్టర్ల చూపు ఈ యువ బ్యాటర్ మీద పడింది. ఈ సిరీస్ జూన్ 23 నుంచి 30 వరకు జరగనుంది. మరి సీనియర్లు రెస్ట్ తీసుకోవడంతో రింకు సింగ్ కి టీంఇండిలోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.