లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ పై మామిడిపళ్ల ఎఫెక్ట్ గట్టిగానే పడింది. తన పెట్టిన పోస్ట్ ఇప్పుడు తనకే రివర్స్ కొట్టింది. ఎవరూ వదలట్లేదు. ప్రతిఒక్కరూ ఆడేసుకుంటున్నారు. ట్రోలింగ్ తో జ్యూస్ పిండేస్తున్నారు.
ఈసారి ఐపీఎల్‌లో మ్యాచ్‌లు, ఎవరు గెలుస్తారు? ఏం జరుగుతుంది? లాంటి విషయాల కంటే.. విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ చాలా అంటే చాలా వైరల్ అయింది. సరే అయిందేదో అయింది అని వదిలేయొచ్చుగా. నవీన్ వదల్లేదు. ఇన్ డైరెక్ట్ గా మామిడిపళ్ల తింటూ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడు. ఇప్పుడు అది మనోడికే రివర్స్ కొట్టింది. ముంబయిపై ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో మ్యాచ్ ఓడిపోయేసరికి వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. ప్రతిఒక్కరూ నవీన్ ని ఓ రేంజులో ఆడుకుంటున్నారు. చెప్పాలంటే అడ్డంగా బుక్కయిపోయాడు. అసలేంటి గొడవ? ఇప్పుడు ఏం జరుగుతుంది?
ఈ గొడవ.. చిన్నస్వామి స్టేడియంలో లక్నో-ఆర్సీబీ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ తో మొదలైంది. బెంగళూరులో ఆర్సీబీ ఓడిపోవడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు గోలగోల చేశారు. వారిని నోరు మూసుకోండి అన్నట్లు గంభీర్ చేత్తే నోటిపై వేలు పెట్టి సైగ చేశాడు. ఇది గుర్తుపెట్టుకున్న కోహ్లీ.. కొన్నాళ్లకు లక్నోని వాళ్ల సొంతగడ్డపై ఆర్సీబీ ఓడించిన తర్వాత తిరిగి కౌంటర్ ఇచ్చేశాడు. కానీ గంభీర్ తీసుకోలేకపోయాడు. కోహ్లీతో గొడవ పెట్టుకున్నాడు. వీళ్లిద్దరి మధ్యలోకి లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ వచ్చాడు. అప్పటినుంచి కోహ్లీ-గంభీర్ గొడవ కాస్త కోహ్లీ-నవీన్ గొడవగా మారిపోయింది. ఇది ఆ మ్యాచ్ తో ఆగిపోలేదు.
ఆ తర్వాత ఆర్సీబీ ఓ మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్ ని టీవీలో చూస్తున్న పిక్ ని పోస్ట్ చేసి, మామిడిపళ్లు బాగున్నాయంటూ బెంగళూరు జట్టుని ఇన్ డైరెక్ట్ గా నవీన్ ట్రోల్ చేశాడు. కోహ్లీ ఫ్యాన్స్ తోపాటు క్రికెట్ అభిమానులకు ఇది చాలా కోపం తెప్పించింది. తాజాగా ప్లే ఆఫ్స్ లో భాగంగా లక్నో జట్టు ముంబయితో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది. ఇందులో నవీన్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కానీ 81 పరుగుల తేడాతో ముంబయి విజయం సాధించింది. దీంతో అందరూ మామిడిపళ్ల విషయాన్ని బయటకు తీశారు. ప్రముఖ ఫుడ్ ఆర్డర్ సంస్థలైన స్విగ్గీ, జొమాటో మ్యాంగోస్ ఫొటో పెట్టి నవీన్ ని ట్రోల్ చేశాయి. ముంబయి ప్లేయర్ సందీప్ వారియర్ కూడా ఇన్ స్టాలో మ్యాంగోస్ తో దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు. కానీ తర్వాత డిలీట్ చేసేశాడు. రాజస్థాన్ జట్టు కూడా మామిడిపళ్ల సింబల్ తో నవీన్ ని పిండేసింది. ఇలా వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. దాదాపు ప్రతిఒక్కరూ నవీన్ ని ఆడేసుకుంటున్నారనే చెప్పాలి. మరి కోహ్లీతో గొడవ, నవీన్ పై ట్రోలింగ్ చూస్తుంటే మీకేం అనిపిస్తోంది? కింద కామెంట్ చేయండి.
Mumbai Indian players 🥭😂🤣
What goes around, comes around 🥭#LSGvMI #naveenulhaq #naveen_ul_haq #naven #MumbaiIndians pic.twitter.com/KVeAdwxxTA
— IHD Fantasy Prediction (@FantasyIhd) May 24, 2023