Virat Kohli, Naveen Ul Haq: మ్యాచ్ తర్వాత మైదానంలో భావోద్వేగాల నడుమ ఏదో అయింది అయిపోయింది అనుకుంటే.. మ్యాచ్ తర్వాత కూడా ఆటగాళ్లు ఆ గొడవను కొనసాగిస్తున్నాడు.
ఐపీఎల్ వేదికగా సోమవారం ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లు పరుగుల వరదపారకున్నా, మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి ప్రేక్షకులకు బోర్ కొట్టించినా.. చివర్లో మాత్రం ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్ ప్రధానంగా ఈ గొడవ జరిగింది. ప్రస్తుతం ఈ విషయమే టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా ఉంది. అయితే.. మ్యాచ్ అయిపోయిన తర్వాత.. క్రికెట్ అభిమానులు మధ్య వార్ మొదలైంది. తప్పు ఎవరిదో తేల్చుకునేందుకు క్రికెట్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో వాదనలుకు దిగుతున్నారు.
ఎవరి వాదనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా.. మ్యాచ్ తర్వాత జరిగిన వివాదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆటకు ఇలాంటి ఘటనలు మంచి కాదని, ఆటగాళ్లు హుందాగా వ్యవహరించాలంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు సైతం ఆటగాళ్లకు సూచిస్తున్నారు. అయితే ఈ వివాదంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉండటంతో గొడవపై అందరిలో ఆసక్తి నెలకొంది. సరే మ్యాచ్ తర్వాత మైదానంలో భావోద్వేగాల నడుమ ఏదో అయింది అయిపోయింది అనుకుంటే.. మ్యాచ్ తర్వాత కూడా ఆటగాళ్లు ఆ గొడవను కొనసాగిస్తున్నాడు.
మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. మనం ఏదైన తీసుకోగలిగితేనే చెప్పాలి లేదా మూసుకోని కూర్చోవాలి అనేలా అన్నాడు. దానికి యువ క్రికెటర్ నవీన్ ఉల్ హక్.. ‘నీకు ఏం దక్కాలో అదే దక్కుతుంది. అలాగే ఉండాలి, అలాగే జరుగుతుంది కూడా’ అంటూ ఇస్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇవి రెండు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆటగాళ్లు గ్రౌండ్‌లో జరిగిన గొడవను ఇంకా మర్చిపోలేదని, ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారంటూ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అయితే.. ఒక సీనియర్‌గా కోహ్లీని గౌరవించకుండా నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టడంపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ-నవీన్ గొడవలో చాలా మంది నవీన్‌కే సపోర్ట్ చేసినా.. ఇన్‌స్టా పోస్టుతో వీడికి కూడా తలపొగరు బాగానే ఉందంటూ విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Naveen Ul Haq’s latest Instagram story. pic.twitter.com/YWJBK6Hm9R
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2023