Mumbai Indians Chairs: ఇప్పటికే లెక్కలేనన్ని వ్యాపారాలు ఉన్న ముంబై ఇండియన్స్ ఓనర్స్ మరో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. అందుకు ముంబై ఇండియన్స్ టీమ్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకుంటున్నారు.
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ఏందంటే.. అనుమానం లేకుండా అంతా ముంబై ఇండియన్స్ అని చెప్పేస్తారు. అందుకు కొలమానం ట్రోఫీ. ఏ జట్టుకు లెనన్ని ట్రోఫీలు ముంబై ఇండియన్స్‌కు ఉన్నాయి. ఇప్పటి వరకు 15 సీజన్లు జరిగితే.. అందులో ఏకంగా 5 సార్లు ముంబైనే ఛాంపియన్‌గా నిలిచింది. అవన్నీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే. అందుకే ముంబైకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఐపీఎల్‌లో ఆర్సీబీ, ముంబై, చెన్నై జట్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకు ప్రధాన కారణం.. కోహ్లీ, రోహిత్, ధోని అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ముంబైకి రోహిత్ కారణంగా వచ్చిన క్రేజ్‌కి తోడు.. సక్సెస్ వల్ల వచ్చిన క్రేజ్ కూడా కొంత ఉంది.
ఆ క్రేజ్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం వీలైనంతగా వాడుకుంటుంది. ముంబై టీమ్ ఓనర్ ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అనే విషయం తెలిసిందే. రిలయన్స్ సామ్రాజ్యాధినేతలు వాళ్లు. ఇప్పటికే వారికి బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ముంబై ఇండియన్స్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకూంటూ.. కుర్చీల వ్యాపారంలోకి సైతం దిగిపోయారు. ముంబై ఇండియన్స్ లోగోతో పాటు, వారి జెర్సీ కలర్‌తో సరికొత్త కుర్చీలను లాంచ్ చేశారు. అయితే.. ఒక్కొ కుర్చీ ధర భారీగానే ఉంది. ఈ ముంబై ఇండియన్స్ కుర్చీలు మీకు కావాలంటే.. ఒక్కొ కుర్చీకి రూ.34,999 చెల్లించాల్సిందే. ఇంత ఖరీదైన కుర్చీని ఎక్కువగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిజానికి వారిని దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఈ కుర్చీలను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. మరి వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
तयार का, Paltan?
Cheer for Mumbai Indians in style with the World’s First Mumbai Indians Chair 😍
Limited time offer, Shop Now 👉 https://t.co/QDHsH1DYOw 🛒#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #Cybeart #JoinTheRevolution #IPL2023 #TATAIPL pic.twitter.com/ze2EwqHpY9
— Mumbai Indians (@mipaltan) April 5, 2023