ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ లో అరుదైన ఘనత సాధించింది. ఈ జట్టులోని బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయనప్పటికీ ఈ రికార్డు నమోదు కావడం విశేషం. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయి ఇండియన్స్, ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో దుమ్మురేపింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించి, క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబయి బ్యాటర్లు, బౌలర్లు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడారు. ఆరో కప్ గెలుచుకోవడమే టార్గెట్ గా మరో ముందడుగు వేశారు. ఇక్కడవరకు బాగానే ఉంది కానీ ముంబయి.. ఎలిమినేటర్ పోరులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే బ్యాటింగ్ సరిగా చేయకపోయినాసరే ఈ ఘనత సాధించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఆ రికార్డు ఏంటి? దాని సంగతేంటి?
అసలు విషయానికొచ్చేస్తే.. చెపాక్ లో తాజాగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత ఓవర్లలో 182/8 స్కోరు చేసింది. గ్రీన్ 41 పరుగులు, సూర్య కుమార్ 33, తిలక్ వర్మ 26 పరుగులు చేశారు. ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ముంబయి బౌలర్లలో ఆకాష్ మద్వాల్ 5 పరుగులిచ్చి 5 వికెట్లతో కేక పుట్టించాడు. అయితే ఈ పోరులో ముంబయి ఫస్ట్ బ్యాటింగ్ కి దిగడంతో.. ఫ్యాన్స్ గెలుస్తామా లేదా అని సందేహపడ్డారు. కానీ అదిరిపోయే బౌలింగ్ దెబ్బకు విజయం సాధించింది.
లక్నోపై గెలవడంతో పాటు ప్లే ఆఫ్స్ లో ముంబయి సరికొత్త రికార్డు సృష్టించింది. ఏ బ్యాటర్ కూడా 50 పరుగులు చేయనప్పటికీ.. ఓ ఇన్నింగ్స్ లో ఎక్కువ స్కోరు చేసిన జట్టుగా అరుదైన ఘనత నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు సన్ రైజర్స్ పేరిట ఉంది. 2018 ఫైనల్లో చెన్నైపై 178 పరుగులు చేసింది. ఇప్పుడు దాన్ని ముంబయి ఇండియన్స్ బ్రేక్ చేసింది. చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ముంబయి బ్యాటర్లపై తప్ప బౌలర్లపై పెద్దగా నమ్మకాల్లేవు. కానీ అంతా రివర్స్ లో జరిగింది. సరే ఇదంతా పక్కనబెడితే ప్లే ఆఫ్స్ లో ముంబయి క్రేజీ రికార్డు సెట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
A MI-ghty special victory! 😎
The Mumbai Indians win by 81 runs and progress to the #Qualifier2 of #TATAIPL 2023 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/77zW6NmInn
— IndianPremierLeague (@IPL) May 24, 2023